News April 1, 2024

రూ.151 చెల్లిస్తే ఇంటికే రాములోరి తలంబ్రాలు: TSRTC

image

శ్రీరామ నవమి సందర్భంగా భద్రాచలంలో జరగబోయే శ్రీ సీతారామచంద్రుల కళ్యాణోత్సవ తలంబ్రాలను భక్తులకు అందజేయాలని TSRTC యాజమాన్యం నిర్ణయించింది. రూ.151 చెల్లిస్తే రాములోరి కళ్యాణ తలంబ్రాలను భక్తుల ఇళ్ల వద్దకు చేరవేస్తామని తెలిపింది. ఇందుకోసం టీఎస్‌ఆర్టీసీ లాజిస్టిక్స్ కేంద్రాల్లో రూ.151 చెల్లించి వివరాలను నమోదు చేసుకోవాలని, వివరాలకు 040-23450033, 040-69440000, 040-69440069 ను సంప్రదించాలని సూచించింది.

Similar News

News March 26, 2026

మార్కాపురం: ప్రయాణికుల వివరాలు ఇవే(2/2)

image

బాలు పామూరుకు 2టికెట్స్ బుకింగ్, రవి, వసంత వినుకొండ, అనిల్, సౌదా కనిగిరి, సుజాత, మనోజ్ వింజమూరు, బన్నీ, హరి రాయల్ పామూరు, హరి కనిగిరి 2టికెట్లు బుక్ చేసుకున్నారు. ప్రయాణికుల్లో ఎక్కువ మంది కనిగిరి నియోజకవర్గ వాసులే ఉన్నారు. 13మంది చనిపోగా మిగిలిన వాళ్లు గాయపడ్డారు.

News March 26, 2026

వీళ్లనూ పట్టించుకోండి బ్రదర్.. గొడవలు వద్దు!

image

హైదరాబాద్‌లోని పెట్రోల్ బంకుల సిబ్బందికి పనిభారం అమాంతం పెరిగింది. విపరీతమైన రద్దీతో క్షణం తీరిక లేకుండా పోయింది. పలు చోట్ల వాహనదారులు ట్యాంక్ ఫుల్ చేయాలని పట్టుబడుతున్నారు. స్టాక్ ఉందని, టెన్షన్ పడొద్దని చెప్పినా వినిపించుకోకుండా సిబ్బందితో వాగ్వాదానికి దిగుతున్నారు. ఓ వైపు ఎండ, మరోవైపు ఇలాంటి తలనొప్పితో బంకుల్లో పనిచేసేవారు చుక్కలు చూస్తున్నారు. వారి బాధను అర్థం చేసుకుందాం. వారికి సహకరిద్దాం.

News March 26, 2026

సుప్రీంలీడర్‌గా ఉండమని ఇరాన్ కోరింది: ట్రంప్

image

ట్రంప్ వంటి వ్యక్తులతో అసలు చర్చలే చేయమని <<19472137>>ఇరాన్<<>> అంటున్న వేళ ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సుప్రీంలీడర్‌గా బాధ్యతలు తీసుకోమని ఇరాన్ తనను అనధికారికంగా కోరిందని.. కానీ తనకు అవసరం లేదని ఆ ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించానని చెప్పుకొచ్చారు. రిపబ్లికన్ పార్టీకి చెందిన ఓ ఫండ్ రైజింగ్ ఈవెంట్‌లో ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికాతో వీలైనంత త్వరగా డీల్ చేసుకోవాలని ఇరాన్ కోరుకుంటోందని ఈ సందర్భంగా తెలిపారు.