News April 8, 2025
ఇవాళ ఈ వ్రతం చేస్తే వైవాహిక సమస్యలుండవు!

ఇవాళ ‘కామదా ఏకాదశి’. ఈరోజు వివాహితులు లక్ష్మీ నారాయణులను ఆరాధిస్తే మంచిదని పురోహితులు చెబుతున్నారు. అలాగే విధిగా ‘కామదా ఏకాదశి వ్రతం’ చేస్తే పాపాలు పోవడం, వైవాహిక సమస్యలు తొలగడం తథ్యమని సూచిస్తున్నారు. శాపం కారణంగా ఓ గంధర్వుడు రాక్షసుడి రూపంలో జీవితం కొనసాగిస్తే, అతని భార్య ఈ వ్రతం చేయడంతో శాపం తొలగిపోతుంది. భార్యాభర్తలు విడిపోకుండా చూసే శక్తి ఈ వ్రతానికి ఉందని వివరిస్తున్నారు.
Similar News
News December 23, 2025
VHT: విరాట్, రోహిత్ ఫ్యాన్స్‌కు తప్పని నిరాశ

భారత స్టార్ క్రికెటర్లు విరాట్, రోహిత్ చాలాకాలం తర్వాత విజయ్ హజారే ట్రోఫీలో ఆడుతున్నారు. వీరిద్దరి ఆట చూడాలనుకున్న ఫ్యాన్స్‌కు నిరాశే ఎదురైంది. ఢిల్లీ-ఏపీ మ్యాచ్ బెంగళూరులో, ముంబై-సిక్కిం మ్యాచ్ జైపూర్‌లో బుధవారం జరగనున్నాయి. ఈ 2 వేదికలలో ఆన్లైన్ స్ట్రీమింగ్, బ్రాడ్‌కాస్ట్‌కు బీసీసీఐ ఏర్పాట్లు చేయలేదు. NZతో ODI సిరీస్‌కు ముందు సన్నాహకాలుగా ఈ మ్యాచ్‌లు ఉపయోగపడతాయని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
News December 23, 2025
ఆ అవినీతిలో పవన్‌కూ వాటాలు: అంబటి

AP: లోకేశ్ అవినీతిలో పవన్‌కు వాటా ఉందని YCP నేత అంబటి రాంబాబు ఆరోపించారు. మెడికల్ కాలేజీల దందాలోనూ ఆయనకు వాటా ఉన్నట్లుందని, అందుకే అరెస్టు అనేసరికి భయపడుతున్నారని పేర్కొన్నారు. ‘సీజ్ ద షిప్ అన్నారు. ఏమైంది? పోర్టులో అక్రమ రవాణా మరింత పెరిగింది. నాగబాబుకు మంత్రి పదవి అన్నారు. ఓ డీఎస్పీ సెటిల్మెంట్లు చేస్తున్నారని, శిక్షించాలని అడిగారు. ఏమైనా అయ్యాయా? కూటమిలో మీ పరిస్థితి అదీ’ అని ఎద్దేవా చేశారు.
News December 23, 2025
ఈ నెలాఖరు నుంచి ఫ్యామిలీ సర్వే

AP: ఈ నెలాఖరు నుంచి యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే(UFS) నిర్వహించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరిస్తారని తెలిపింది. ‘అర్హులకు సంక్షేమ పథకాలు, సేవలు అందించడం, కుటుంబాల సమాచారాన్ని అప్డేట్ చేయడం ఈ సర్వే ఉద్దేశం. తద్వారా భవిష్యత్తులో ప్రభుత్వ సర్టిఫికెట్ల జారీ సులభతరమవుతుంది. పౌరుల వ్యక్తిగత సమాచార భద్రతకు భంగం వాటిల్లదు’ అని పేర్కొంది.


