News January 30, 2025
జాబ్ మానేస్తే ఒకేసారి 8 నెలల శాలరీ: ట్రంప్

US అధ్యక్షుడు ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశంలో ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్యను తగ్గించేందుకు ‘బైఅవుట్స్’ ఆఫర్ ప్రకటించారు. ఏ ఫెడరల్ ఉద్యోగి అయినా స్వచ్ఛందంగా ఉద్యోగం మానేస్తే 8 నెలల శాలరీ ఇస్తామని తెలిపారు. ఈమేరకు 20 లక్షల మంది ఎంప్లాయిస్కు ప్రభుత్వం మెయిల్స్ పంపింది. ఫిబ్రవరి 6లోపు నిర్ణయం తీసుకోవాలని డెడ్లైన్ విధించింది. 5-10% మంది రిజైన్ చేసినా 100 బిలియన్ డాలర్లు ఆదా అవుతాయని అంచనా.
Similar News
News January 10, 2026
మార్స్కైనా వెళ్లాల్సిందే: బంగ్లా క్రికెటర్

భారత్తో సంబంధాలు దెబ్బతినడంతో మన దేశంలో T20WC ఆడేందుకు <<18807855>>BCB <<>>నిరాకరించిన విషయం తెలిసిందే. దీనిపై వరల్డ్ కప్ కోసం ఎంపికైన బంగ్లా ఆల్రౌండర్ మహెదీ హసన్ స్పందించారు. ‘అనిశ్చితి అనేది మేనేజ్మెంట్ సమస్య. దానిని అఫీషియల్స్ డీల్ చేయాల్సి ఉంటుంది. మా పని క్రికెట్ ఆడటం మాత్రమే. మీరు ఆటగాళ్లను మార్స్కు పంపినా వెళ్లి ఆడతారు. దానిపై వారికి ఎలాంటి అభ్యంతరం ఉండదు’ అని వ్యాఖ్యానించారు.
News January 10, 2026
మరోసారి చర్చకు టికెట్ రేట్ల పెంపు!

ప్రీమియర్ షోలు, టికెట్ రేట్ల పెంపుపై TG ప్రభుత్వ నిర్ణయాలు అభిమానులను అయోమయానికి గురిచేస్తున్నాయి. మొన్న అర్ధరాత్రి జారీ చేసిన ‘రాజాసాబ్’ టికెట్ రేట్ల పెంపు మెమోను నిన్న HC సస్పెండ్ చేసింది. జీవో 120 ప్రకారం టికెట్ రేట్ రూ.350 మించకూడదని స్పష్టం చేసింది. ఇంతలోనే తాజాగా ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమా ప్రీమియర్స్కు <<18817046>>అనుమతి<<>> ఇవ్వడం, టికెట్ రేట్ను రూ.600గా నిర్ణయించడంపై విమర్శలు వస్తున్నాయి. COMMENT
News January 10, 2026
పండుగ క్లీనింగ్ ఇలా ఈజీ

పండుగకు ఇల్లు క్లీనింగ్ చెయ్యాలంటే ఒకేసారి అన్నీ పనులు పెట్టుకుంటారు. దీంతో పని ఎక్కువగా అనిపిస్తుంది. త్వరగా క్లీనింగ్ పూర్తవ్వదు. అలా కాకుండా రోజుకో రూమ్ క్లీన్ చేయండి. ఫర్నీచర్, గ్యాడ్జెట్స్, ఎలక్ట్రానిక్ వస్తువుల్ని క్లీన్ చేసేటప్పుడు మైక్రోఫైబర్ క్లాత్ వాడండి. క్లీన్ చేయడానికి ముందే అవసరం లేని వస్తువులు, నెలలు తరబడిన వస్తువులు, బట్టలు, విరిగిపోయిన గిన్నెలు, కుర్చీల వంటివన్నీ కూడా పారేయండి.


