News December 11, 2024

2 గంటల్లో 12 పెగ్గులేస్తే..

image

యువత, మధ్య వయస్కుల్లో బింగే, హై ఇంటెన్సిటీ డ్రింకింగ్ అలవాటు ప్రమాద ఘంటికలు మోగిస్తోందని డాక్టర్లు అంటున్నారు. 2 గంటల్లోనే 6 పెగ్గులేస్తే బింగే, 10-12 వరకు తాగితే హై ఇంటెన్సిటీ డ్రింకింగ్ అంటారు. సోషల్ ఆబ్లిగేషన్స్, ఫ్రెండ్స్ వల్ల అతిగా మద్యం తాగే అలవాటు పెరుగుతోందని వారు చెప్తున్నారు. దీంతో పాంక్రియాస్, లివర్, స్టొమక్, హార్ట్, మైండ్, నెర్వస్ సిస్టమ్ రోగాలబారిన పడతాయని వార్నింగ్ ఇస్తున్నారు.

Similar News

News November 16, 2025

‘దమ్ముంటే పట్టుకోండి’ అన్నోడిని పట్టుకున్నారు: సీవీ ఆనంద్

image

TG: Ibomma నిర్వాహకుడు ఇమ్మడి రవిని <<18292861>>అరెస్టు <<>>చేసిన HYD సైబర్ క్రైమ్ పోలీసులను రాష్ట్ర హోం శాఖ స్పెషల్ సీఎస్ CV ఆనంద్ అభినందించారు. ‘‘జూన్ నుంచి సైబర్ క్రైమ్ టీమ్ రేయింబవళ్లు కష్టపడింది. రవిని తప్ప ఈ పైరసీకి సంబంధించిన వాళ్లందరినీ పట్టుకుంది. ‘దమ్ముంటే పట్టుకోండి’ అని పోలీసులకు సవాలు విసిరి, బెదిరించిన వ్యక్తిని ఇప్పుడు అరెస్టు చేసింది. DCP కవిత, CP సజ్జనార్‌కు కంగ్రాట్స్’’ అని ట్వీట్ చేశారు.

News November 16, 2025

రేపే కార్తీక మాస చివరి సోమవారం.. ఇలా చేస్తే కోటి జన్మల పుణ్యం

image

రేపు కార్తీక మాసంలో చివరి సోమవారం. గత సోమవారాలు, పౌర్ణమి వేళ 365 వత్తుల దీపం వెలిగించని, దీపదానం చేయని వారు రేపు ఆ లోపాన్ని సరిదిద్దుకోవచ్చని పండితులు చెబుతున్నారు. ఈ ఒక్క రోజు శివారాధన కోటి సోమవారాల ఫలితాన్ని, కోటి జన్మల పుణ్యాన్ని ఇస్తుందని నమ్ముతారు. రేపు ప్రదోష కాలంలో ఆవు నెయ్యితో దీపారాధన చేసి, శివుడి గుడిలో దీపదానం చేస్తే శుభకరమని సూచిస్తున్నారు. మరిన్ని ఆధ్యాత్మిక కథనాల కోసం <<-se_10013>>భక్తి<<>>.

News November 16, 2025

నేడు నాన్ వెజ్ తినవచ్చా?

image

కార్తీక మాసంలో రేపు(చివరి సోమవారం) శివాలయాలకు వెళ్లేవారు, దీపారాధన, దీపదానం చేయువారు నేడు నాన్ వెజ్ తినకూడదని పండితులు సూచిస్తున్నారు. అది కడుపులోనే ఉండి రేపటి పూజకు అవసరమైన శరీర పవిత్రతను దెబ్బ తీస్తుందని అంటున్నారు. ‘మాంసాహారం రజోతమో గుణాలను ప్రేరేపించి, దైవారాధనలో ఆటంకం కలిగించవచ్చు. కాబట్టి శివానుగ్రహాన్ని పొందడానికి, పూజ ఫలం కలగడానికి నేడు సాత్విక ఆహారం స్వీకరించడం ఉత్తమం’ అంటున్నారు.