News March 13, 2025

ఇలా చదివితే ఈజీగా గుర్తుంటాయ్!

image

ఇది పరీక్షల సమయం. సిస్టమేటిక్‌గా చదువుకుంటే ఈజీగా పరీక్షలు రాయొచ్చు. దీనికి పోమోడోర్ టెక్నిక్‌ (టైమ్ మేనేజ్‌మెంట్) ఎంతో యూజ్‌ఫుల్ అని నిపుణులు చెబుతున్నారు. ‘చదవాల్సిన విషయాన్ని ఎంచుకోండి. దీనికోసం టైమర్‌ని 25 ని.లకు సెట్ చేసుకోండి. టైమర్ పూర్తవగానే ఓ 10 ని.లు బ్రేక్ ఇవ్వండి. నాలుగు సార్లు ఇలా చేశాక 30 ని.లు బ్రేక్ తీసుకోండి. ఇలా చేస్తే దృష్టి మెరుగై పరధ్యానం తగ్గుతుంది’ అని తెలిపారు. SHARE IT

Similar News

News November 14, 2025

బీటెక్ పాసైన వారికి 250 ఉద్యోగాలు.. జీతం రూ.లక్ష!

image

కేంద్ర క్యాబినెట్ సెక్రటేరియట్‌లో 250 డిప్యూటీ ఫీల్డ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి షార్ట్ నోటిఫికేషన్ విడుదలైంది. బీటెక్, ఎంఎస్సీతో పాటు GATE పాసైతే దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 30ఏళ్లకు మించకూడదు. కంప్యూటర్ సైన్స్/ఐటీ, డేటా సైన్స్/ఏఐ, ఎలక్ట్రానిక్స్, మెకానికల్ తదితర విభాగాల్లో వెకెన్సీస్ ఉన్నాయి. జీతం నెలకు రూ.44,900-1,42,400. త్వరలో స్వీకరణ తేదీ వెల్లడించనున్నారు. చివరి తేదీ DEC 14.

News November 14, 2025

దూసుకెళ్తున్న నవీన్ యాదవ్

image

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తున్నారు. ఏడో రౌండ్ ముగిసేసరికి ఆయన 19వేలకు పైగా ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. మరో మూడు రౌండ్లు కౌంటింగ్ చేయాల్సి ఉంది.

News November 14, 2025

గొర్రె పిల్లల పెరుగుదల వేగంగా ఉండాలంటే..

image

గొర్రె పిల్లల పెరుగుదల వాటి జాతి, లభించే పోషకాహారంపై ఆధారపడి ఉంటుంది. పుట్టిన నెల వయసు నుంచే గొర్రె పిల్లలను కూడా తల్లులతో పాటు మేత కోసం బయటకు తీసుకెళ్తారు. ఆ సమయంలో సంపూర్ణ పోషకాహారం అందక గొర్రె పిల్లల్లో రోజువారీ పెరుగుదల 100 గ్రాములకు మించడం లేదు. అదే గొర్రె పిల్లలకు 150 రోజుల వరకు షెడ్లలో ఉంచి సంపూర్ణ ఆహారం అందిస్తే అవి రోజుకు కనీసం 175 గ్రాముల వరకు పెరుగుతాయని వెటర్నరీ నిపుణులు చెబుతున్నారు.