News August 21, 2025

30 రోజులు జైల్లో ఉంటే ఔట్.. మీరేమంటారు?

image

తీవ్ర నేరారోపణలతో 30 రోజులు జైల్లో ఉండే ప్రజాప్రతినిధిని పదవి నుంచి తొలగించే బిల్లును కేంద్రం నిన్న పార్లమెంట్‌లో ప్రవేశపెట్టడం <<17462790>>దుమారానికి<<>> దారి తీసింది. ప్రస్తుత కక్షా రాజకీయాల్లో శిక్ష పడకుండానే ఎవరినైనా పదవుల నుంచి తొలగించేందుకు ప్రభుత్వాలు కుట్ర చేస్తాయని ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. అటు నేరస్థులకు రాజకీయాల్లో చోటు ఉండొద్దని కేంద్రం వాదిస్తోంది. మరి ఈ బిల్లుపై మీ కామెంట్?

Similar News

News August 21, 2025

రోహిత్ తర్వాత వన్డే కెప్టెన్‌గా శ్రేయస్?

image

సీనియర్ కెప్టెన్ రోహిత్ స్థానంలో వన్డే కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్‌‌ను నియమించే యోచనలో BCCI ఉన్నట్లు జాతీయ మీడియా తెలిపింది. వచ్చే WCను దృష్టిలో పెట్టుకొని, సుదీర్ఘ ప్రయోజనాల దృష్ట్యా అయ్యర్‌కే కెప్టెన్సీ ఇచ్చే ఛాన్స్ ఉందని వెల్లడించింది. అటు టెస్టులు, T20లకు గిల్‌ను కెప్టెన్‌గా నియమించే అవకాశముంది. ఈ క్రమంలో గిల్‌కు పనిభారం కాకూడదని అయ్యర్‌కు వన్డే పగ్గాలు అప్పగించాలని భావిస్తున్నట్లు పేర్కొంది.

News August 21, 2025

రాజ్యాంగ సవరణ బిల్లుపై కాంగ్రెస్‌కు బాధ ఎందుకు: కిషన్ రెడ్డి

image

TG: నిన్న లోక్‌సభలో ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజ్యాంగ సవరణ <<17462620>>బిల్లును<<>> దేశమంతా స్వాగతిస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఈ బిల్లు అన్ని పార్టీలకు వర్తించేలా ఉందని అభిప్రాయపడ్డారు. అయితే కాంగ్రెస్‌ ఎందుకు బాధ పడుతుందో అర్థం కావడం లేదన్నారు. బిల్లు విషయంలో INDI కూటమి వ్యవహరిస్తున్న తీరు దురదృష్టకరమని అన్నారు. రాజకీయాల్లో ఆరోపణలు వచ్చినప్పుడు స్వచ్ఛందంగా పదవి నుంచి వైదొలగాలన్నారు.

News August 21, 2025

సినీ కార్మికుల సమ్మెకు ఇవాళ ‘శుభం’ కార్డు?

image

నిర్మాతలు, సినీ ఫెడరేషన్ నాయకుల మధ్య చర్చలు క్లైమాక్స్‌కు చేరాయి. ఇవాళ మ.3 గంటలకు నిర్మాతలతో ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధులు భేటీ కానున్నారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధులతో ఫెడరేషన్ నేతలు సమావేశం కానున్నారు. వేతనాల పెంపు విషయంలో ఇరు వర్గాలు ఓ నిర్ణయానికి వచ్చి సమ్మెకు శుభం కార్డు పలుకుతాయని తెలుస్తోంది. సినీ కార్మికులు షూటింగ్‌లు బంద్ చేయడంతో పలు సినిమాల విడుదలపై ప్రభావం పడింది.