News August 6, 2025

రెండేళ్లు బయట చదివితే స్థానికులు కారా?: సుప్రీం

image

TG: రెండేళ్లు వేరే రాష్ట్రంలో చదివితే విద్యార్థులు స్థానికులు కారా? అని రాష్ట్ర ప్రభుత్వాన్ని SC ప్రశ్నించింది. MBBSలో స్థానిక కోటాలో సీటు పొందాలంటే విద్యార్థులు నీట్ రాయడానికి ముందు నాలుగేళ్లు TGలోనే చదవాలన్న GO.33పై విచారించింది. 2028 నుంచి దీనిని ఎందుకు అమలు చేయకూడదని ప్రశ్నిస్తూనే పూర్తి వాదనలు ఎల్లుండిలోగా సమర్పించాలని ఆదేశించింది. ఇలాంటి రూల్స్ విషయంలో విద్యార్థులను ముందే హెచ్చరించాలంది.

Similar News

News August 7, 2025

75% హాజరు తప్పనిసరి: CBSE

image

బోర్డు పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు 75% హాజరు తప్పనిసరి అని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) స్పష్టం చేసింది. అటెండెన్స్ రికార్డులు సరిగా లేకపోయినా, విద్యార్థులు క్రమం తప్పకుండా స్కూలుకు రావట్లేదని తేలినా పాఠశాలలపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది. అత్యవసర పరిస్థితులు, మెడికల్ ఎమర్జెన్సీ, జాతీయ/అంతర్జాతీయ స్పోర్ట్ ఈవెంట్స్ వంటి కారణాలతో హాజరు కాని వారికి 25% సడలింపు ఉండనుంది.

News August 7, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News August 7, 2025

ఆగస్టు 7: చరిత్రలో ఈరోజు

image

1907: ఆంధ్ర రాష్ట్ర రెండో ముఖ్యమంత్రి బెజవాడ గోపాలరెడ్డి జననం
1925: హరిత విప్లవ పితామహుడు MS స్వామినాథన్ జననం
1941: విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ మరణం (ఫొటోలో)
1947: తెలుగు హాస్య నటుడు సుత్తివేలు జననం
1980: బ్యాడ్మింటన్ క్రీడాకారుడు చేతన్ ఆనంద్ జననం
2018: తమిళనాడు మాజీ సీఎం ఎం.కరుణానిధి మరణం
☛ జాతీయ చేనేత దినోత్సవం