News July 9, 2024
కాలకృత్యాల కోసం ప్లాస్టిక్ బాటిల్ తీసుకెళ్తే..

TG: కాలకృత్యాల కోసం ప్లాస్టిక్ బాటిల్‌లో నీళ్లు తీసుకెళ్లిన వ్యక్తికి అటవీశాఖ అధికారులు ఊహించని షాక్ ఇచ్చారు. శ్రీశైలం-హైదరాబాద్ మార్గంలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వులో ప్లాస్టిక్ వస్తువులను బ్యాన్ చేశారు. అయితే నిన్న మహారాష్ట్రకు చెందిన ఓ వ్యక్తి కాలకృత్యాల కోసం అడవిలోకి ప్లాస్టిక్ బాటిల్ తీసుకెళ్లాడు. ఇది గమనించిన పెట్రోలింగ్ సిబ్బంది అతడిని పట్టుకుని రూ.2వేల ఫైన్ వేశారు.
Similar News
News January 4, 2026
ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్స్ ఇండియాలో పోస్టులు

ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (<
News January 4, 2026
‘జెలెన్‌స్కీని పుతిన్ బంధిస్తే?’.. ట్రంప్‌పై రో ఖన్నా ఫైర్!

వెనిజులా అధ్యక్షుడు మదురో అరెస్ట్‌ను భారత సంతతి US MP రో ఖన్నా తప్పుబట్టారు. ఇది ఒక అనవసర యుద్ధమని విమర్శించారు. ‘ఇలాంటి దాడుల వల్ల ప్రపంచానికి తప్పుడు సంకేతాలు వెళ్తాయి. రేపు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీని పుతిన్ బంధిస్తే? లేదా తైవాన్ నేతలపై చైనా దాడి చేస్తే అప్పుడు మనం ఏమనగలం?’ అని ప్రశ్నించారు. ఈ చర్య వల్ల అంతర్జాతీయ వేదికపై అమెరికా నైతిక బలాన్ని కోల్పోతుందని రో ఖన్నా అభిప్రాయపడ్డారు.
News January 4, 2026
మదురోను బంధించిన డెల్టా ఫోర్స్.. అసలు ఎవరీ కిల్లర్ టీమ్?

US సైన్యంలో అత్యంత రహస్యమైన, పవర్‌ఫుల్ విభాగం డెల్టా ఫోర్స్. 1977లో బ్రిటీష్ SAS స్ఫూర్తితో దీన్ని స్థాపించారు. ఇందులో చేరడం చాలా కష్టం. వీరు యూనిఫామ్ ధరించకుండా సాధారణ పౌరుల్లా ఉంటూ రహస్య ఆపరేషన్లు చేస్తారు. సద్దాం హుస్సేన్ పట్టివేత, అల్ బగ్దాదీ హతం తాజాగా మదురో అరెస్ట్ వంటి మిషన్లు వీరే చేశారు. అత్యాధునిక ఆయుధాలు, నైట్ విజన్ టెక్నాలజీతో శత్రువులకు చిక్కకుండా మెరుపు దాడి చేయడం వీరి స్పెషాలిటీ.


