News August 5, 2025
బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేస్తే..

బ్రహ్మ ముహూర్తం రోజూ ఉ.3.45 గం. నుంచి ఉ.5.30 వరకు ఉంటుంది. ఈ సమయంలో నిద్ర లేవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
*ఈ సమయంలో నిద్రలేచి కుడి నాసికా రంధ్రం ద్వారా లోతైన శ్వాస తీసుకుంటే రక్తంలో ఆక్సిజన్ స్థాయులు పెరుగుతాయి.
*ఈ సమయంలో చదివితే ఎక్కువ కాలం గుర్తుంటుంది. ఓం మంత్రాన్ని జపించడం వల్ల మెదడు ఉత్తేజితం అవుతుంది.
*కాలుష్యం ఉండదు కాబట్టి వాకింగ్, జాగింగ్ చేసేందుకు మంచి సమయం.
Similar News
News August 5, 2025
‘ఒక్క ఛాన్స్’.. దొరికేనా?

‘ఒక్క ఛాన్స్’ అంటూ సినీ ఇండస్ట్రీలో ప్రొడక్షన్ కంపెనీల బయట ఎదురు చూసేవారు ఎందరో. అవకాశం వస్తే టాలెంట్ నిరూపించుకోవాలని చూస్తుంటారు. తాజాగా టాలీవుడ్ నిర్మాతలు <<17304563>>నిర్ణయం<<>>తో అలాంటి వారిలో ఆశలు పెరిగాయి. ఈ నిర్ణయంతో ఆసక్తి ఉన్న వారికి <
News August 5, 2025
జైళ్ల శాఖలో వార్డర్ పోస్టుల భర్తీ చేపట్టాలి: అనిత

AP: జైళ్ల శాఖలో ఖాళీగా ఉన్న 300-400 వార్డర్ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని హోంమంత్రి అనిత అధికారులను ఆదేశించారు. జైళ్లలోని పరిశ్రమలకు టెక్నాలజీ జోడించి అభివృద్ధి చేయాలని ఆదేశించారు. జైళ్లశాఖ అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. ‘రాష్ట్రంలో అసంపూర్తిగా నిలిచిన జైళ్ల భవనాలు పూర్తి చేయాలి. ఇందుకు నిధులు కేటాయించేందుకు కృషి చేస్తా. కొందరు అధికారులు తీరు మార్చుకోవాల్సి ఉంది’ అని ఆమె హెచ్చరించారు.
News August 5, 2025
నేడు భారీ వర్షాలు: IMD

TG: ఇవాళ మేడ్చల్, HYD, సంగారెడ్డి, RR, నాగర్ కర్నూల్, MBNR, వనపర్తి, నారాయణ్‌పేట, గద్వాల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. BHPL, ములుగు, కొత్తగూడెం, KMM, నల్గొండ, సూర్యాపేట, MHBD, వరంగల్, HNK, జనగాం, SDPT, భువనగిరి, వికారాబాద్, MDK, కామారెడ్డిలో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది. ఇతర చోట్ల తేలికపాటి వర్షాలు పడతాయని అంచనా వేసింది.