News October 8, 2024
ఫ్రీగా గ్యాస్ సిలిండర్ కావాలంటే..

ప్రధానమంత్రి ఉజ్వల యోజన స్కీం ద్వారా కేంద్రం మహిళలకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్, ఒక సిలిండర్ అందిస్తోంది. ఇందుకోసం గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ దగ్గరకు వెళ్లి ఫామ్ నింపి, రేషన్, ఆధార్, అడ్రస్, ఫొటోలు సమర్పించాలి. లేదంటే https://pmuy.gov.in/లోకి వెళ్లి Apply for New Ujjwala 2.0 Connectionపై క్లిక్ చేసి అప్లై చేసుకోవచ్చు. సదరు మహిళ బీపీఎల్ కుటుంబానికి చెందినవారై ఉండాలి. ఇప్పటికే ఎల్పీజీ కనెక్షన్ ఉండొద్దు.
Similar News
News January 20, 2026
రాష్ట్రంలో ఉద్యోగాలు.. దరఖాస్తుకు నేడే చివరితేదీ

TGSRTCలో 198 పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ నేటితో ముగియనుంది. ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీ 84, మెకానికల్ సూపర్వైజర్ ట్రైనీ 114 ఉద్యోగాలను TSLPRB భర్తీ చేస్తోంది. నెలకు పేస్కేల్ రూ.27,080-రూ.81,400 ఉంటుంది. వయసు 18-25 ఏళ్ల మధ్య ఉండాలి. రాత పరీక్ష, మెడికల్ టెస్ట్ ద్వారా సెలక్ట్ చేస్తారు.
అర్హతలు, ఎంపిక ప్రక్రియ వివరాలు www.tgprb.inలో అందుబాటులో ఉంటాయి.
News January 20, 2026
రేపటి నుంచి JEE మెయిన్స్

TG: JEE మెయిన్స్ సెషన్-1 పరీక్షలు రేపటి నుంచి ప్రారంభమవుతాయి. ఈనెల 21, 22, 23, 24, 28, 29 తేదీల్లో ఎగ్జామ్స్ జరగనున్నాయి. ఉ.9 గం.-మ.12 వరకు, మ.3గం.-సా.6 వరకు 2 సెషన్స్ ఉంటాయి. HYD, SEC, వరంగల్, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్, నల్గొండ సహా రాష్ట్రంలో 14 కేంద్రాల్లో పరీక్షలు జరుగుతాయి. 40వేల మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఇప్పటికే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.
News January 20, 2026
మాఘ మాసంలో చేయాల్సిన పూజలివే..

మాఘ మాసంలో నారాయణుడిని, శివుడిని పూజించాలి. వసంత పంచమి నాడు సరస్వతీ దేవిని, రథసప్తమి నాడు సూర్యుడిని, భీష్మ ఏకాదశి నాడు విష్ణుమూర్తిని ఆరాధించడం శ్రేష్టం. మహాశివరాత్రి పర్వదినాన లింగోద్భవ కాలంలో శివార్చన చేయడం వల్ల మోక్షం లభిస్తుంది. పూజలతో పాటు శక్తి కొలది నువ్వులు, బెల్లం, ఉప్పు, వస్త్రాలను దానం చేస్తే కోటి యజ్ఞాలు చేసినంత పుణ్యం దక్కుతుందని పురాణాల వాక్కు. ఆదివారం సూర్యారాధన చేయాలి.


