News September 7, 2025
బంధం బలంగా మారాలంటే..

ఆలుమగల బంధంలో మాటకు ఎంతో ప్రాధాన్యం ఉంది. చాలామంది భాగస్వామితో ఎన్నో చెప్పాలనుకుంటారు. కానీ వాళ్లు అపార్థం చేసుకుంటారేమోనని చెప్పరు. లోలోపలే సతమతం అవుతుంటారు. దీంతో నిస్తేజం ఆవరిస్తుంది. మనసులోని మాటను చెబితేనే అసంతృప్తికి దూరంగా ఉండవచ్చు. అలాగే కొందరు మాటలతోనే భాగస్వామిని గాయపరుస్తుంటారు. దాంతో ఇద్దరి మధ్యా దూరం మరింత పెరుగుతుంది. కాబట్టి భాగస్వామితో మనసు విప్పి మాట్లాడటం చాలా ముఖ్యం.
Similar News
News September 7, 2025
రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలు.. నేడే చివరి తేదీ

AP: రాష్ట్ర పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డులో 42 అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టుల దరఖాస్తుకు ఇవాళే చివరి తేదీ. లాయర్ వృత్తిలో కనీసం మూడేళ్ల అనుభవం ఉన్నవారు అర్హులు. అభ్యర్థులను రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. వయసు 42 ఏళ్లకు మించకూడదు. జీతం రూ.57,100 నుంచి రూ.1,47,760 వరకు ఉంటుంది. నిర్ణీత ఫీజు చెల్లించి <
News September 7, 2025
ఖాళీ కడుపుతోనే పాక్‌పై సెంచరీ చేశా: సెహ్వాగ్

టీమ్ ఇండియా మాజీ ఓపెనర్ సెహ్వాగ్ ఆసియా కప్‌కు ముందు పాక్‌తో తలపడిన క్షణాలను గుర్తు చేసుకున్నారు. ‘ఎప్పుడు పాక్‌పై మ్యాచ్ ఓడినా నేను నా టెంపర్‌మెంట్ కోల్పోతాను. 2008 కరాచీలో జరిగిన మ్యాచ్‌లో 300 రన్స్ ఛేజ్ చేయాలి. ఆరోజు నేను ఉపవాసంలో ఉన్నా. నా ఆకలి తీరాలంటే రన్స్ చేయాలనుకున్నా’ అని చెప్పుకొచ్చారు. ఆ మ్యాచ్‌లో సెహ్వాగ్ 95 బంతుల్లో 119 రన్స్ చేశారు. టీమ్ ఇండియా 6 వికెట్ల తేడాతో గెలుపొందింది.
News September 7, 2025
రాష్ట్రంలో మరో వారంపాటు వర్షాలు

TG: రాష్ట్రంలో మరో వారంపాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నెల 8 నుంచి 14 వరకు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ, భువనగిరి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడతాయని అంచనా వేసింది.