News October 5, 2025

అమ్మ అవ్వాలనుకుంటే ఇలా సిద్ధంకండి

image

మాతృత్వం అనేది ఒక వరం. దీనికోసం ముందుగా శరీరాన్ని సిద్ధం చేసుకోవాలని, లేదంటే పుట్టే బిడ్డ పలు సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ‘ఆహారంలో ఫోలిక్ యాసిడ్, మోనో శాచురేటెడ్ ఫ్యాట్స్ చేర్చుకోవాలి. అన్ని రకాల కూరగాయలు, పండ్లు, నట్స్, బ్రౌన్ రైస్, ఓట్స్ డైట్‌లో ఉండేలా చూడాలి. ఆలివ్ ఆయిల్‌ను వాడితే గర్భాశయానికి రక్త ప్రసరణ సరిగ్గా జరుగుతుంది’ అని చెబుతున్నారు.

Similar News

News October 5, 2025

కలెక్షన్లలో పవన్ కళ్యాణ్ ‘OG’ సెన్సేషన్

image

పవన్ కళ్యాణ్, సుజిత్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘OG’ థియేటర్లలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ ఏడాది అత్యధిక గ్రాస్ వసూలు చేసిన తెలుగు చిత్రంగా నిలిచిందని మూవీ యూనిట్ ట్వీట్ చేసింది. దీంతో ‘సంక్రాంతికి వస్తున్నాం’(రూ.300+ కోట్లు) రికార్డును బ్రేక్ చేసినట్లు అయింది. ఈ మూవీలో ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటించగా ఇమ్రాన్ హష్మీ, ప్రకాశ్ రాజ్, అర్జున్ దాస్ కీలక పాత్రలు పోషించారు.

News October 5, 2025

బంకుల్లో ఇవి ఫ్రీ.. లేదంటే ఫిర్యాదు చేయండి

image

పెట్రోల్ బంకుల్లో ఫ్రీగా వాటర్, టాయ్‌లెట్స్, ఫస్ట్ ఎయిడ్ కిట్, టైర్లకు గాలి అందించాలి. ఫ్యూయల్‌పై డౌట్ ఉంటే కస్టమర్ కొలత, క్వాలిటీ చెక్ ఎక్విప్‌మెంట్ అడగవచ్చు. చాలాచోట్ల నీళ్లుండవు, మూత్రశాలలు దుర్గంధంతో వాడలేము. ఇక టైర్లలో ఎయిర్‌కు చిల్లర డిమాండ్ చేసే స్థాయికి చేరింది. మీరూ ఈ సమస్య ఎదుర్కొంటే ఫిర్యాదు చేయొచ్చు. BPCL-1800224344, HPCL-18002333555, IOCL-1800233355, రిలయన్స్-18008919023.
Share It

News October 5, 2025

ముంచే ముప్పు.. ముందే తెలుసుకోలేమా..?

image

దేశంలో కొండచరియలు విరిగిపడి ఏటా వందలాది మంది చనిపోతున్నారు. ఇవాళ నేపాల్‌లో 51 మంది, డార్జిలింగ్‌లో 18 మంది బలయ్యారు. దీంతో ల్యాండ్‌స్లైడ్స్ ముప్పును ముందే తెలుసుకోలేమా అనే చర్చ నడుస్తోంది. వెదర్ అలర్ట్స్ వ్యవస్థల్లాగే వీటిని హెచ్చరించే సిస్టమ్‌ను NDMA, GSI, NLRMS అభివృద్ధి చేశాయి. సిక్కిం, కేరళ, ఉత్తరాఖండ్‌లో ప్రస్తుతం ట్రయల్స్‌లో ఉన్న సిస్టమ్ విజయవంతమైతే ముప్పు నుంచి ప్రజల్ని తప్పించవచ్చు.