News January 22, 2025

ధనవంతులు అవ్వాలంటే.. ఇవి తప్పనిసరి!

image

జాబ్ అయినా చిన్న వ్యాపారం అయినా పొదుపు, పెట్టుబడుల కోసం పక్కనబెట్టాకే ఖర్చులకు వాడితే బెటర్. అలాగే, మంచిరోజు కోసమో అప్పుడే ఎందుకు? అనుకోకుండా ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనే ఆలోచన వచ్చినప్పుడే ఆ పని ప్రారంభించాలి. ఇతరులతో పోల్చుకొని హంగులు, ఆర్భాటాలకు పోకుండా తక్కువలోనే జీవిస్తే అధిక మొత్తం పోగేసేందుకు వీలుంటుంది. ఎప్పటికప్పుడు నిపుణులతో మాట్లాడుతూ పన్నుల నుంచి మినహాయింపు పొందేలా ప్లాన్ చేసుకోవాలి.

Similar News

News January 21, 2026

భార్యను చంపి వాట్సాప్ స్టేటస్ పెట్టాడు

image

TG: వనపర్తికి చెందిన ఆంజనేయులు, సరస్వతి (34) HYD బోరబండలో అద్దెకు ఉంటున్నారు. వీరికి 12ఏళ్ల కుమారుడు, 9 ఏళ్ల కూతురు ఉన్నారు. భర్త ఉద్యోగం మానేయడంతో ఆర్థిక సమస్యలు తీవ్రమై గొడవలు జరిగేవి. అటు ఆంజనేయులు భార్యపై అనుమానం పెంచుకున్నాడు. దీంతో సోమవారం రాత్రి నిద్రిస్తున్న భార్యను రోకలి బండతో కొట్టి చంపి పారిపోయాడు. ‘నా జీవితంలో సగభాగమైన నిన్ను నా చేతులారా నేనే చంపుకున్నా’ అని వాట్సాప్ స్టేటస్ పెట్టాడు.

News January 21, 2026

‘మీ ఫోన్ కూడా ట్యాప్’?.. ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్!

image

TG: ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో హరీశ్ రావుకు సిట్ అధికారులు సంచలన విషయాలు చెప్పినట్లు తెలుస్తోంది. ‘2018 ఎన్నికల తర్వాత మీ ఫోన్, మీ కుటుంబసభ్యుల ఫోన్లు ట్యాప్ అయ్యాయని మీకు తెలుసా?’ అని ప్రశ్నించినట్లు సమాచారం. దీంతో హరీశ్ షాక్‌కు గురై ‘ఇది మీరు సృష్టించారా?’ అని అడిగారని, పోలీసులు ట్యాప్ అయిన తేదీలు చెబుతూ ఆధారాలు చూపించారని వార్తలొస్తున్నాయి. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.

News January 21, 2026

WPL: ఇక థ్రిల్లింగ్ మ్యాచులేనా?

image

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL-2026) ఈసారి థ్రిల్లింగ్‌గా మారింది. ఇప్పటికే RCB ప్లేఆఫ్ బెర్త్ ఖరారు చేసుకోగా మిగతా 2 జట్లు తేలాల్సి ఉంది. MI, యూపీ, గుజరాత్, ఢిల్లీ నాలుగేసి పాయింట్లతో ఉన్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై మిగతా 2 మ్యాచ్‌ల్లో గెలిస్తేనే పోటీలో ఉంటుంది. అటు గుజరాత్, ఢిల్లీ, UP తొలిసారి ట్రోఫీని అందుకునే అవకాశాన్ని నిలుపుకోవాలంటే మిగతా మ్యాచుల్లో ఆధిపత్యం ప్రదర్శించాల్సిందే.