News December 17, 2024
కేసులు పెట్టి ఆనందం పొందాలనుకుంటే మీ కర్మ: కేటీఆర్

TG: ఫార్ములా-ఈ రేసుకు సంబంధించిన కేసులో అరెస్టు చేస్తారనే ప్రచారం నేపథ్యంలో కేటీఆర్ ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘బీజేపీతో ఢిల్లీలో చిట్టి గారి కాళ్ల బేరాలు, జైపూర్లో అదానీతో డిన్నర్ రిజల్ట్ వచ్చినట్లున్నాయి. ఢిల్లీకి పోయి 3 పైసలు తీసుకురాకున్నా, మూడు కేసులు పెట్టి శునకానందం పొందాలనుకుంటే మీ కర్మ. గుడ్ లక్ చిట్టినాయుడు. మేము న్యాయపరంగా ఎదుర్కొంటాం’ అని ట్వీట్ చేశారు.
Similar News
News December 11, 2025
భీమవరం: ‘స్పేస్ టెక్నాలజీలో ఏపీ నెంబర్ వన్ కావాలి’

స్పేస్ టెక్నాలజీలో ఏపీ నెంబర్ వన్ కావాలనే ఉద్దేశంతోనే ఏపీ స్పేస్ టెక్నాలజీ అకాడమీ అమరావతి ఏర్పాటైందని
ఇస్రో మాజీ శాస్త్రవేత్త డా శేషగిరిరావు అన్నారు. గురువారం భీమవరంలో అడ్వాన్సింగ్ స్పేస్ సైన్స్ అండ్ సొసైటీ అనే అంశంపై జరిగిన సదస్సులో మాట్లాడారు. ప్రస్తుతం స్పేస్ ఎకానమీలో మన వాటా 2 శాతం మాత్రమే ఉందని, రానున్న కాలంలో 10 శాతానికి పెంచాల్సిన అవశ్యకత ఎంతైనా ఉందన్నారు.
News December 11, 2025
ESIC ఢిల్లీలో 134 సీనియర్ రెసిడెంట్ పోస్టులు

<
News December 11, 2025
ఉత్కంఠ.. 4 ఓట్లతో గెలిచింది

TG: హన్మకొండ(D) ఎల్కతుర్తి మండలం ఆరేపల్లిలో సర్పంచ్ ఓట్ల లెక్కింపు ఉత్కంఠకు దారి తీసింది. చివరికి పి.స్రవంతి 4 ఓట్లతో గెలిచారు. కామారెడ్డి(D) బిక్కనూరు మండలం ర్యాగట్లపల్లిలో BRS బలపరిచిన భాగ్యమ్మ 5 ఓట్లతో గట్టెక్కారు. వరంగల్(D) వర్ధన్నపేట మండలం అంబేడ్కర్నగర్ 1వ వార్డులో రజనీ, రూపకు తలో 31 ఓట్లు రావడంతో డ్రా అయింది. అధికారులు ఫలితం కోసం చిట్టీలు వేయగా రూపను అదృష్టం వరించింది.


