News October 24, 2025

అమ్మబోతే అడివి.. కొనబోతే కొరివి

image

ఇది రైతుల కష్టాల గురించి తెలిపే సామెత. అన్నదాతలు పండించిన పంటను అమ్మాలనుకుంటే కొనేవారు ఎవరూ ఉండరు. లేదా చాలా సందర్భాల్లో గిట్టుబాటు ధర లభించక తక్కువ ధరకే అమ్మాల్సి వస్తుంటుంది. కానీ అదే ధాన్యాన్ని రైతు కొనాలనుకుంటే మాత్రం అధిక ధర చెల్లించాల్సి ఉంటుంది. అందుకే ఈ పరిస్థితిని ‘అమ్మబోతే అడివి.. కొనబోతే కొరివి’గా చెబుతుంటారు. ఈ పరిస్థితి ఇప్పటికీ కొనసాగుతుండటం నిజంగా బాధాకరం.

Similar News

News October 24, 2025

ఫిబ్రవరి 25 నుంచి ఇంటర్ పరీక్షలు.. ఇవాళ షెడ్యూల్!

image

TG: ఇంటర్ బోర్డు పరీక్షలు వచ్చే ఏడాది ఫిబ్రవరి 25 నుంచి నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ముందుగా 23 నుంచే నిర్వహించాలని అధికారులు భావించారు. అయితే గత 13 ఏళ్లుగా బుధవారం రోజే పరీక్షలు మొదలవడంతో అదే సెంటిమెంట్ దృష్ట్యా 25 నుంచి నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇవాళ షెడ్యూల్ రిలీజ్ కానున్నట్లు బోర్డు వర్గాలు తెలిపాయి. కాగా ఏపీలో ఫిబ్రవరి 23 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే.

News October 24, 2025

మార్కాపురంలోకి శ్రీశైలం?.. ప్రభుత్వానికి ప్రతిపాదనలు

image

AP: ప్రతిపాదిత మార్కాపురం జిల్లాలో శ్రీశైలాన్ని కలిపేలా అధికారులు ప్రభుత్వానికి ప్రపోజల్స్ పంపినట్లు తెలుస్తోంది. నంద్యాల(D) కేంద్రానికి శ్రీశైలం దూరంగా ఉండటంతో స్థానికుల నుంచి వినతులు వచ్చినట్లు సమాచారం. మార్కాపురానికి శ్రీశైలం 80 కి.మీ. దూరంలో ఉండగా, నంద్యాల-శ్రీశైలం మధ్య 165 కి.మీ దూరం ఉంది. మరోవైపు అద్దంకిని బాపట్ల(D) నుంచి తిరిగి ప్రకాశం(D)లో విలీనం చేసే ప్రతిపాదనలూ ఉన్నట్లు సమాచారం.

News October 24, 2025

అయోడిన్ లోపంతో ఎన్నో సమస్యలు

image

అయోడిన్‌ మన జీవక్రియల్లో కీలకపాత్ర పోషిస్తుంది. థైరాయిడ్‌ గ్రంథి అయోడిన్‌ను గ్రహించి, దాన్ని థైరాయిడ్‌ హార్మోన్లుగా మారుస్తుంది. ఇది తగ్గితే శరీర ఉష్ణోగ్రత, చురుకుదనం, శ్వాస, గుండెవేగం, జీవక్రియ దెబ్బతింటాయి. అయోడిన్‌ లోపిస్తే గాయిటర్‌, రొమ్ముల్లో క్యాన్సర్‌ రహిత గడ్డలు ఏర్పడతాయి. చేపలు, సముద్ర ఆహారం, పాలు, గుడ్లు, సోయా ఉత్పత్తుల్లో అయోడిన్‌ ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.