News March 20, 2024

త్వరగా నిద్ర రావాలంటే..

image

నిద్రలేమితో చాలా రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. రాత్రి 7-9 గంటల నిద్ర అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.
*గది శుభ్రంగా ఉండాలి. దోమలు రాకుండా చూడాలి
*పది నిమిషాలు నచ్చిన పుస్తకం చదవండి. శ్రావ్యమైన సంగీతం వినండి
*నిద్ర పోవడానికి గంట ముందే ఫోన్ పక్కనపెట్టేయండి
*అనవసరమైన ఆలోచనలు పెట్టుకోకండి
*రాత్రిపూట కాఫీ, టీ తాగొద్దు.

Similar News

News November 25, 2024

నేడు RGVని విచారించనున్న ప్రకాశం పోలీసులు

image

డైరెక్టర్ RGVని ఇవాళ ప్రకాశం జిల్లా పోలీసులు విచారించనున్నారు. వ్యూహం సినిమా ప్రమోషన్లలో భాగంగా చంద్రబాబు, పవన్‌ను కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని మద్దిపాడు పోలీస్ స్టేషన్లో ఆయనపై కేసు నమోదైంది. వారం కిందటే విచారణకు రావాలని పోలీసులు నోటీసులివ్వగా, తనకు సమయం కావాలని వాట్సాప్‌లో ఆర్జీవీ మెసేజ్ పంపారు. ఆ గడువు అయిపోగా, నేడు ఆయన్ను విచారించడానికి ఒంగోలు PSలో ఏర్పాట్లు చేశారు.

News November 25, 2024

IPL: ఈరోజు వేలానికి వచ్చేది వీరే..

image

డుప్లెసిస్, ఫిలిప్స్, విలియమ్సన్, సామ్ కరన్, మిచెల్, కృనాల్ పాండ్య, సుందర్, శార్దుల్ ఠాకూర్, ఇంగ్లిస్, దీపక్ చాహర్, ఫెర్గ్యూసన్, భువనేశ్వర్ కుమార్, ముకేశ్ కుమార్, ముజీర్ రెహ్మాన్, మోయిన్ అలీ, టిమ్ డేవిడ్, విల్ జాక్స్, ముస్తాఫిజుర్, నవీన్ ఉల్ హక్, ఉమేశ్ యాదవ్, స్టీవ్ స్మిత్, లూయిస్, శాంట్నర్, హెన్రీ, అల్జరీ జోసెఫ్, హోల్డర్ etc. పూర్తి లిస్ట్ కోసం <>క్లిక్<<>> చేయండి. ఇవాళ మ.3.30 గం.కు వేలం షురూ అవుతుంది.

News November 25, 2024

మహా విజయం: నిఫ్టీ 300+ గ్యాప్అప్ ఓపెనింగ్?

image

మహారాష్ట్రలో BJP+ కూటమి ఘన విజయంతో స్టాక్ మార్కెట్లు నేడు భారీ లాభాల్లో మొదలవుతాయని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. NSE నిఫ్టీ 300-400, BSE సెన్సెక్స్ 1500-2000 పాయింట్ల గ్యాప్‌అప్‌తో ఓపెనవుతాయని అంటున్నారు. వ్యాపార, వాణిజ్యానికి కీలకమైన MHలో BJP గెలుపు ప్రభుత్వ పాలసీల్లో సుస్థిరత్వాన్ని ప్రతిబింబిస్తోందని చెప్తున్నారు. గిఫ్ట్‌ నిఫ్టీ 300 పాయింట్లు పెరగడం సానుకూల సంకేతాలు పంపిందని అంటున్నారు.