News September 16, 2024
లండన్లో చదవాలంటే రూ.15 లక్షలు అకౌంట్లో ఉండాల్సిందే!

లండన్లో ఉన్నత చదువు చదవాలనుకునే విదేశీ విద్యార్థుల నెలవారీ ఖర్చులకు అవసరమయ్యే నిధుల పరిమితిని యూకే పెంచింది. లండన్లో చదవాలనుకునే వారు నెలకు రూ.1.63 లక్షలు (1,483 పౌండ్లు), లండన్ బయట చదవాలనుకునేవారు రూ.1.25 లక్షలు (1,136 పౌండ్లు) తమ అకౌంట్లో చూపించాలని స్పష్టం చేసింది. 9 నెలల కంటే ఎక్కువ కాలం చదివేవారు దాదాపు రూ.14.77 లక్షలు అకౌంట్లో ఉన్నట్లు వీసా చెకింగ్ సమయంలో చూపాలని పేర్కొంది.
Similar News
News November 25, 2025
కొడంగల్లో రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి

కొడంగల్ మున్సిపల్ కార్యాలయం ముందు మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. లారీ ఢీకొట్టడంతో దాని వెనుక టైర్ల కిందపడి తీవ్రంగా గాయపడిన అతడు అక్కడికక్కడే మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. మృతుడు దుద్యాల్ మండలం చిల్ముల్ మైలారం గ్రామానికి చెందిన హన్మయ్య(35)గా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News November 25, 2025
ఈ నెల 30 వరకు వరుస సమావేశాలు

TG: గ్లోబల్ సమ్మిట్ నేపథ్యంలో ఈ రోజు నుంచి నవంబర్ 30 వరకు కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎం రేవంత్ వరుస సమావేశాలు నిర్వహిస్తారని CMO తెలిపింది.
25 : తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నిర్వహణపై మీట్
26 : లాజిస్టిక్స్, సమ్మిట్ ఏర్పాట్లు
27 : మౌలిక వసతులు, అభివృద్ధి
28 : విద్య, యువజన సంక్షేమం
29 : వ్యవసాయం, అనుబంధ విభాగాలు, సంక్షేమం
30 : ఆరోగ్యం, వైద్య, కుటుంబ సంక్షేమం
News November 25, 2025
NIT రాయ్పుర్లో ఉద్యోగాలు

NIT రాయ్పుర్ 7పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు ఈ నెల 28 వరకు అప్లై చేసుకోవచ్చు. ఫీల్డ్ వర్క్స్, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి ఇంటర్ ఉత్తీర్ణతతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఈ మెయిల్ ద్వారా దరఖాస్తును
pavanmishra.it@nitrr.ac.inకు పంపాలి.


