News October 15, 2025
పాదాలు తెల్లగా అవ్వాలంటే..

చాలామంది ఇతర శరీర భాగాలపై పెట్టిన శ్రద్ధ పాదాలపై పెట్టరు. దీంతో ఇవి దీర్ఘకాలంలో నల్లగా మారిపోతాయి. ఇలాకాకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించాలంటున్నారు చర్మ నిపుణులు. కాళ్లను క్లీన్ చేశాక తడిలేకుండా తుడుచుకుని మాయిశ్చరైజర్ రాయాలి. బయటకు వెళ్లేటపుడు సన్‌స్క్రీన్ రాసుకోవాలి. లాక్టిక్ యాసిడ్, గ్లైకాలిక్ యాసిడ్, విటమిన్ C, హైడ్రోక్వినోన్‌లున్న లైటెనింగ్ క్రీములు వాడాలని సూచిస్తున్నారు.
Similar News
News October 15, 2025
గూగుల్ రాక.. CBN అదిరిపోయే ట్వీట్

AP: వైజాగ్‌లో <<18002028>>గూగుల్<<>> AI హబ్ ఏర్పాటుకు ఒప్పందం జరిగిన నేపథ్యంలో సీఎం చంద్రబాబు అదిరిపోయే ట్వీట్ చేశారు. VIZA‘G’లో ఉండే G అంటే ఇప్పుడు గూగుల్ అని పేర్కొన్నారు. ‘యంగెస్ట్ స్టేట్ హై ఇన్వెస్ట్‌మెంట్’ అంటూ హాష్ ట్యాగ్ ఇచ్చారు. గూగుల్ రాకపై ప్రధాని మోదీ సైతం హర్షం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
News October 15, 2025
అక్టోబర్ 30న శ్రీవారి పుష్పయాగం

తిరుమల శ్రీవారి ఆలయంలో అక్టోబర్ 30న పుష్పయాగ మహోత్సవాన్ని నిర్వహించనున్నారు. దీనికి ముందు రోజు అంకురార్పణ జరుగుతుంది. పుష్పయాగం రోజున ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి ఉత్సవమూర్తులకు పాలు, పెరుగు, తేనె, చందనం వంటి ద్రవ్యాలతో స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. మధ్యాహ్న వివిధ రకాల పుష్పాలు, పత్రాలతో వేడుకగా పుష్పయాగం చేస్తారు. సాయంత్రం స్వామివారు నాలుగు మాడ వీధుల్లో భక్తులకు దర్శనం ఇస్తారు.
News October 15, 2025
ఓ టెకీ.. నీ శరీరం కోరుకుంటోందిదే!

స్తంభించిన జీవనశైలితో ఎంతో మంది టెకీలు తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నట్లు ‘నేచర్ సైన్స్ రిపోర్ట్స్’ అధ్యయనంలో తేలింది. ‘సమయానికి ఆహారం ఇవ్వవు. ఇచ్చినా ప్రాసెస్ చేయలేని జంక్ ఇస్తావ్. నిద్రలేక నేను కూడా అలసిపోయాను. నా మాటే వినకపోతే, నీ ఆరోగ్యం ప్రమాదంలో పడుతుంది’ అని టెకీ శరీరం హెచ్చరిస్తోంది. అందుకే ఇకనైనా రోజూ వ్యాయామం, నడకతో పాటు సరైన నిద్రాహారాలు ఉండేలా చూసుకోండి. SHARE IT