News January 22, 2025
మీరే ప్రధాని అయితే..
USA అధ్యక్షుడైన తొలిరోజే ట్రంప్ సంతకాలతో సంచలనాలు సృష్టిస్తున్నారు. పుట్టుకతో పౌరసత్వం, WHO నుంచి USA ఎగ్జిట్, దక్షిణ సరిహద్దులో ఎమర్జెన్సీ సహా అనేక ముఖ్య నిర్ణయాలపై ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు జారీ చేస్తున్నారు. ఈ సంతకాలపై USతో పాటు ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అయితే ‘ఒకే ఒక్కడు’లో ఒక్కరోజు CMలా, మీరు ఒక్కరోజు ప్రధానిగా ఒక్క నిర్ణయం అమలు చేసే అధికారం వస్తే ఏ ఫైలుపై సైన్ చేస్తారు? కామెంట్ చేయండి.
Similar News
News January 22, 2025
తెలుగు రాష్ట్రాల్లో పురుష, మహిళా ఓటర్ల శాతం ఇలా..
దేశంలోని 12 రాష్ట్రాల్లో పురుషులతో పోలిస్తే మహిళా ఓటర్లు అధికంగా ఉన్నట్లు ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక వెల్లడించింది. ఏపీలో 100 మంది పురుషులకు గానూ 103 మంది(100:103) మహిళలు, తెలంగాణలో 100 మంది పురుషులకు 100 మంది మహిళా ఓటర్లు(100:100) ఉన్నట్లు పేర్కొంది. కేరళ, అరుణాచల్ ప్రదేశ్లో అత్యధికంగా ఈ నిష్పత్తి 100: 109గా ఉంది. అత్యల్పంగా గుజరాత్, హరియాణా, ఢిల్లీలో 100:84గా ఉన్నట్లు తెలిపింది.
News January 22, 2025
రేపటి నుంచి స్లాటెడ్ దర్శన టోకెన్ల జారీ
తిరుమల శ్రీవారి స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లను రేపటి నుంచి జారీ చేయనున్నట్లు టీటీడీ వెల్లడించింది. SSD టోకెన్ల జారీపై అధికారులతో TTD EO సమీక్షించారు. ఈ విధానం లేకుండా దర్శనాలు ఎలా జరిగాయి? రద్దు చేస్తే కలిగే పరిణామాలు, క్యూ లైన్లు, భద్రత వంటి అంశాలపై చర్చించారు. రేపటి నుంచి ఏ రోజుకారోజు టోకెన్లను అలిపిరి భూదేవి కాంప్లెక్స్, విష్ణు నివాసం, శ్రీనివాసంలో జారీ చేయాలని ఈవో శ్యామలరావు ఆదేశించారు.
News January 22, 2025
MLAకు గుండెపోటు.. ఇప్పుడు ఎలా ఉన్నారంటే?
TG: గుండెపోటుకు గురైన BRS ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉంది. ప్రాణాపాయం లేదని వైద్యులు వెల్లడించారు. కుటుంబంతో సహా డెహ్రాడూన్ పర్యటనలో ఉన్న ఆయన 2 రోజుల క్రితం గుండెపోటుకు గురయ్యారు. వెంటనే కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా, డాక్టర్లు స్టంట్ వేశారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని తెలియడంతో బీఆర్ఎస్ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నాయి.