News January 13, 2025

ఈ రోజున శివుడిని పూజిస్తే..

image

ఇవాళ చాలా ప్రత్యేకమైనది. పుష్య మాసంలో సోమవారం రోజున భోగి, పౌర్ణమి తిథి, ఆరుద్ర నక్షత్రం కలిసి రావడం చాలా అరుదని పండితులు చెబుతున్నారు. ఏకాదశ రుద్రాలను పూజిస్తే లభించే ఫలితం ఇవాళ శివుడిని పూజిస్తే కలుగుతుందని అంటున్నారు. నువ్వుల నూనెతో దీపారాధన, పూజగదిలో శివ లింగానికి పంచామృతాలతో అభిషేకం చేస్తే ఆర్థిక సమస్యల నుంచి బయటపడొచ్చని చెబుతున్నారు. ఓం నమ: శివాయ అని పఠిస్తే ప్రయోజనకరమని అంటున్నారు.

Similar News

News January 13, 2025

సంక్రాంతి: ఎమర్జెన్సీ సేవకులూ మీ త్యాగానికి సెల్యూట్!

image

ఇంటిల్లిపాది పండగ చేసుకుంటుంటే వారి ఇళ్లు మాత్రం బోసిపోతుంటాయి. తల్లిదండ్రులు, బామ్మా తాతలు, తోబుట్టువులు, మిత్రులతో కలిసి పిల్లలు సందడి చేస్తుంటే వారి ఇళ్లలోనేమో డ్యూటీకి వెళ్లిన నాన్న, అమ్మ ఎప్పుడొస్తారోనని ఎదురు చూస్తుంటారు. రైల్వే, RTC, పోలీస్, హాస్పిటల్, మీడియా సహా ఎమర్జెన్సీ సర్వీసెస్ వాళ్లు పండగ వేళల్లోనే ఎక్కువ పనిచేయాల్సి వస్తుంది. మనకోసం వేడుకను త్యాగం చేస్తున్న వారికి థాంక్స్ చెబుదామా!

News January 13, 2025

PHOTOS: కుంభమేళాలో భక్తజన సంద్రం

image

యూపీలోని ప్రయాగ్ రాజ్‌లో కుంభమేళాకు భక్తులు పోటెత్తారు. త్రివేణీ సంగమంలో పుణ్య స్నానాలు చేయడానికి వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు భారీగా తరలివచ్చారు. ఇవాళ్టి నుంచి 45 రోజులపాటు కుంభమేళా కొనసాగనుంది. భూ మండలంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుకగా దీనిని పేర్కొంటారన్న సంగతి తెలిసిందే.

News January 13, 2025

IPL: ఆ జట్టుకు 17 మంది కెప్టెన్లు

image

IPL చరిత్రలో ఎక్కువ మంది కెప్టెన్లు మారిన జట్టుగా పంజాబ్ కింగ్స్ నిలిచింది. ఇప్పటివరకు ఆ జట్టుకు 17 మంది సారథులు వచ్చారు. అందులో యువరాజ్, సంగక్కర, జయవర్దనే, గిల్‌క్రిస్ట్, డేవిడ్ హస్సీ, బెయిలీ, సెహ్వాగ్, మిల్లర్, మురళీ విజయ్, మ్యాక్స్ వెల్, రవిచంద్రన్ అశ్విన్, KL రాహుల్, మయాంక్ అగర్వాల్, ధవన్, సామ్ కరన్, జితేశ్ శర్మ ఉన్నారు. కానీ ఆ టీమ్ ఒక్క కప్పు కూడా కొట్టలేదు. తాజాగా శ్రేయస్ కెప్టెన్ అయ్యారు.