News November 4, 2024

ఇసుకలో దోచుకుంటుంటే ఎదురు తిరగండి: పవన్

image

AP: ఇసుకను బ్లాక్ మార్కెట్‌లో విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. ‘ఉచిత ఇసుక విషయంలో ఇబ్బందులు కలిగిస్తే సొంత పార్టీ నేతలనైనా కేసులు పెడతామని CM చంద్రబాబు హెచ్చరించారు. చాలా మందికి ఇసుక సంపాదన మార్గం అయిపోయింది. రవాణా ఛార్జీలు చెల్లించి సొంత అవసరాలకు ప్రజలు ఉచితంగా ఇసుక తీసుకెళ్లొచ్చు. మీ హక్కుకు ఎవరు భంగం కలిగించినా ఎదురుతిరగండి’ అని పిలుపునిచ్చారు.

Similar News

News October 23, 2025

వేధింపులను ధైర్యంగా ఎదుర్కోండి

image

చాలామంది మహిళలు భర్త, అత్తవారింటి నుంచి వేధింపులు ఎదురైనపుడు కుటుంబ పరువు గురించి ఆలోచించి వాటిని భరిస్తూ కుంగిపోతున్నారు. కొందరు ప్రాణాలు కూడా తీసుకుంటున్నారు. మహిళలను వెంబడించినా, దూషించినా, అడ్డుకున్నా, వేధింపులకు గురి చేసినా.. ఐపీసీ పలు సెక్షన్ల కింద శిక్షార్హులని చెబుతున్నారు నిపుణులు. ఇలాంటి వాటిపై మహిళలు అవగాహన పెంచుకోవాలని, అందుబాటులో ఉన్న సౌకర్యాలు వాడుకోవాలని సూచిస్తున్నారు.

News October 23, 2025

APPLY NOW: IRCTCలో 64 ఉద్యోగాలు

image

IRCTCలో 64 హాస్పిటాలిటీ మానిటర్స్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వెలువడింది. కాంట్రాక్ట్ పద్ధతిలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. హాస్పిటాలిటీ, హోటల్ మేనేజ్‌మెంట్‌, టూరిజంలో బీఎస్సీ/బీబీఏ/ఎంబీఏ పూర్తిచేసిన 28 ఏళ్లలోపు వారు అర్హులు. రెండేళ్ల అనుభవం ఉండాలి. నవంబర్ 8-18 తేదీల్లో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. వెబ్‌సైట్: https://www.irctc.com/
✒ మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం <<-se_10012>>జాబ్స్<<>> కేటగిరీకి వెళ్లండి.

News October 23, 2025

వర్షంతో ఆటకు అంతరాయం

image

WWC: నవీ ముంబైలో న్యూజిలాండ్‌, భారత్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌కు వర్షం వల్ల ఆటంకం కలిగింది. 48 ఓవర్ల తర్వాత ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. ప్లేయర్లు డ్రెస్సింగ్ రూమ్‌లకు చేరుకోగా, గ్రౌండ్ స్టాప్ కవర్లతో మైదానాన్ని కప్పేశారు. ప్రస్తుతం రోడ్రిగ్స్ 69, హర్మన్ 10 పరుగులతో క్రీజులో ఉన్నారు. భారత్ స్కోర్ 329/2గా ఉంది. అంతకుముందు ప్రతీకా రావల్(122), స్మృతి(109) సెంచరీలతో చెలరేగిన విషయం తెలిసిందే.