News October 21, 2025

నలుగురి గురించి ఆలోచిస్తూ ఉంటే..!

image

నలుగురూ ఏమనుకుంటారో అని భయపడుతున్నారా? ఇది వ్యక్తిగత పురోగతికి ప్రధాన అడ్డంకి అని మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ భయం వల్ల అనేక వినూత్న ఆలోచనలు, నిర్ణయాలు కార్యరూపం దాల్చక, మన మనసులోనే చనిపోతున్నాయని చెబుతున్నారు. దీని నుంచి బయటపడితేనే మనం పూర్తి సామర్థ్యాన్ని చేరుకోగలమని సూచిస్తున్నారు. సొంత ఆలోచనలపై నమ్మకముంచి, నిస్సంకోచంగా ముందుకు సాగడమే విజయానికి తొలిమెట్టు అని నిపుణులు తెలిపారు.

Similar News

News October 21, 2025

శ్రీశైలంలో కార్తీక మాసోత్సవాలు.. ఏర్పాట్లు పూర్తి

image

ద్వాదశ జ్యోతిర్లింగం, అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన శ్రీశైల మహా క్షేత్రంలో రేపటి నుంచి కార్తీక మాసోత్సవాలు ప్రారంభం కానున్నాయి. భక్తుల రద్దీ నేపథ్యంలో గర్భాలయ, సామూహిక అభిషేకాలు, శని, ఆది, సోమవారాల్లో కుంకుమార్చనలు రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. పాతాళగంగ వద్ద పుణ్య స్నానాలకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామన్నారు. యథావిధిగా హోమాలు, కళ్యాణాలు నిర్వహిస్తామని చెప్పారు.

News October 21, 2025

ఏపీ, తెలంగాణ న్యూస్ అప్‌డేట్స్

image

*సీపీఐ ఏపీ కార్యదర్శిగా గుజ్జుల ఈశ్వరయ్య ఎన్నిక
*TTD గోశాలలో గోవుల మృతిపై భూమన కరుణాకర్ ఆరోపణలు. ఈ నెల 23న విచారణకు హాజరుకావాలని పోలీసుల నోటీసులు
*నిజామాబాద్‌లో రియాజ్ ఎన్‌కౌంటర్ ఘటనను సుమోటోగా స్వీకరించిన తెలంగాణ మానవ హక్కుల సంఘం. నవంబర్ 24లోగా పూర్తి నివేదిక ఇవ్వాలని డీజీపీకి ఆదేశాలు
*భీమవరం డీఎస్పీపై ప.గో. ఎస్పీకి డిప్యూటీ సీఎం పవన్ ఫిర్యాదు. సివిల్ వివాదాల్లో జోక్యం చేసుకోకుండా చూడాలని సూచన

News October 21, 2025

స్టీమింగ్‌తో ఎన్నో బెనిఫిట్స్

image

ముఖానికి ఆవిరి పట్టడం వల్ల చర్మం లోపలి నుండి శుభ్రపడుతుంది. రక్తప్రసరణ మెరుగుపడి చర్మం మెరుస్తుందంటున్నారు నిపుణులు. స్టీమ్ ఫేషియల్ చేయడానికి ముందు ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. నీటిలో మీకు నచ్చిన హెర్బ్స్ వేసుకోవచ్చు. ముఖానికి పాత్రకు మధ్య కనీసం 8-10 అంగుళాల దూరం ఉండాలి. 5-10 నిమిషాల పాటు ఆవిరి పట్టిన తర్వాత ముఖాన్ని చల్లని నీటితో కడిగి మాయిశ్చరైజర్ రాసుకుంటే చాలు. మెరిసే ముఖం మీ సొంతం.