News May 24, 2024
IFSలో సత్తా చాటిన రంగన్నగూడెం యువకుడు
బాపులపాడు మండలం రంగన్నగూడెంకి చెందిన తుమ్మల కృష్ణ చైతన్య ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ 2023లో జాతీయ స్థాయిలో 74వ ర్యాంక్ సాధించి సత్తా చాటాడు. కృష్ణ చైతన్య తండ్రి వీర రాజారావు స్థానికంగా ఉన్న ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ సంస్థలో పనిచేస్తున్నారు. కృష్ణ చైతన్య ప్రస్తుతం అమరావతి సచివాలయంలో అసిస్టెంట్ సెక్షన్ అధికారిగా విధులు నిర్వహిస్తున్నారు. IFSలో జాతీయ ర్యాంక్ సాధించిన కృష్ణ చైతన్యను పలువురు అభినందించారు.
Similar News
News November 29, 2024
‘ఫెంగల్’ తుఫానుపై APSDMA ఏం చెప్పిందంటే..
కృష్ణా: ఫెంగల్’ తుఫాను శుక్రవారం సాయంత్రం పుదుచ్చేరికి 270కి.మీ, చెన్నైకి 300 కి.మీ. దూరంలో కేంద్రీకృతం అయిందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ(APSDMA) తెలిపింది. ఈ మేరకు APSDMA ఎండీ రోణంకి కూర్మనాథ్ ఒక ప్రకటన విడుదల చేశారు. తుఫాన్ ప్రభావం దక్షిణ కోస్తా ప్రాంతాలైన బాపట్ల, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాలపై ఉంటుందన్నారు. మత్స్యకారులు ఈ నెల 30 వరకు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దన్నారు.
News November 29, 2024
ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలో రేపు 4,70,210 మందికి పింఛన్లు
ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలో మొత్తంగా రేపు 4,70,210 మంది ఎన్టీఆర్ భరోసా పథకం కింద పింఛన్లు అందుకోనున్నారు. అధికారిక గణాంకాల ప్రకారం ఎన్టీఆర్ జిల్లాలో 2,31,961 మందికి రూ.97,939,00,00, కృష్ణా జిల్లాలో 2,38,249 మందికి రూ.1,01,09,08,500 డిసెంబర్ నెల పింఛన్ల కింద రాష్ట్ర ప్రభుత్వం అందించనుంది. ఈ మేరకు లబ్ధిదారుల ఇళ్ల వద్ద పింఛన్ నగదును పంపిణీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.
News November 29, 2024
కృష్ణా: రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదల
కృష్ణా యూనివర్సిటీ పరిధిలోని కాలేజీలలో సెప్టెంబర్ 2024లో నిర్వహించిన బీ-ఫార్మసీ 2వ సెమిస్టర్ పరీక్షల(2023- 24 విద్యా సంవత్సరం) రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు రీ వాల్యుయేషన్ కోరుకునే విద్యార్థులు డిసెంబర్ 4లోపు ఒక్కో పేపరుకు నిర్ణీత ఫీజు రూ.1,000 చెల్లించాల్సి ఉంటుందని వర్సిటీ తెలిపింది. ఫీజు చెల్లింపు వివరాలకై https://kru.ac.in/ అధికారిక వెబ్‌సైట్ చూడాలని సూచించింది.