News July 24, 2024
బడ్జెట్లో ఇతర రాష్ట్రాలను పట్టించుకోరా?: శ్రీధర్ బాబు

దేశంలోనే తెలంగాణ అతిపెద్ద గ్రోత్ ఇంజిన్ అయినా విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి రావాల్సినవేవీ ప్రకటించలేదని మంత్రి శ్రీధర్ బాబు అసెంబ్లీలో దుయ్యబట్టారు. ‘ఇతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలను పట్టించుకోరా? ఇలాగే వ్యవహరిస్తే మీరు ఆశించిన వికసిత్ భారత్ సాధ్యమా? పర్యాటకాభివృద్ధికి సహకరించాలని ఢిల్లీ పెద్దలను కోరాం. కానీ భద్రాచలం, రామప్ప, వేములవాడ, యాదాద్రి గురించి ప్రస్తావనే లేదు’ అని ఫైర్ అయ్యారు.
Similar News
News November 27, 2025
జీవో 46పై విచారణ రేపటికి వాయిదా

TG: ప్రభుత్వం జారీ చేసిన జీవో 46ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై ఈ జీవో జారీ చేయడంతో వెనుకబడిన కులసంఘాలు పిటిషన్లు వేశాయి. పిటిషనర్ల తరఫున న్యాయవాది సుదర్శన్ అత్యవసర పిటిషన్గా విచారణ చేపట్టాలని కోరారు. బీసీలలో A, B, C, D వర్గీకరణ ఆధారంగా రిజర్వేషన్లు కేటాయించాలని అభ్యర్థించారు. వాదనలు విన్న ధర్మాసనం విచారణను రేపటికి వాయిదా వేసింది.
News November 27, 2025
లడ్డూ విషయంలో లై డిటెక్టర్ పరీక్షకు సిద్ధం: YV సుబ్బారెడ్డి

AP: తిరుమల శ్రీవారి లడ్డూ విషయంలో తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. తాను 30 సార్లు అయ్యప్ప మాల వేసుకున్నానని, దేవుడి ప్రతిష్ఠ పెంచేలా పని చేశానని తెలిపారు. ఈ కేసుకు సంబంధించి లై డిటెక్టర్ పరీక్షకు సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. కల్తీ నెయ్యి ఘటనలో నిజాలు తెలియజేయడానికి సుప్రీం కోర్టులో పిల్ దాఖలు చేసినట్లు వెల్లడించారు.
News November 27, 2025
కీరదోసలో ఆకుమచ్చ, వెర్రి తెగులు నివారణ

కీరదోసలో ఆకులమచ్చ తెగులు వల్ల ఆకులపై చిన్న గుండ్రని మచ్చలు ఏర్పడి, తర్వాత ఇవి పెద్దగా మారి ఆకు ఎండి రాలిపోతుంది. దీని నివారణకు లీటరు నీటికి కాపర్ ఆక్సీక్లోరైడ్ 3గ్రా. కలిపి 10 రోజుల వ్యవధిలో 2సార్లు పిచికారీ చేయాలి. వెర్రి తెగులు వల్ల ఆకులలో ఈనెలు ఉండే ప్రాంతంలో చారలు ఏర్పడి, మొక్క గిడస బారి, పూత తగ్గుతుంది. దీని నివారణకు లీటరు నీటికి డైమిథోయేట్ లేదా ఫిప్రోనిల్ 2mlను కలిపి పిచికారీ చేయాలి.


