News December 16, 2025

IIIT వడోదరలో ఉద్యోగాలు

image

IIIT వడోదర 7 ట్రైనింగ్& ప్లేస్‌మెంట్ ఆఫీసర్, అసిస్టెంట్ రిజిస్ట్రార్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల వారు DEC 22 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి PG(మేనేజ్‌మెంట్/ ఇంజినీరింగ్/LAW), CA ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. రాత పరీక్ష/స్కిల్ టెస్ట్/ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. జీతం నెలకు రూ.56,100- రూ.1,77,500 చెల్లిస్తారు. వెబ్‌సైట్: iiitvadodara.ac.in

Similar News

News December 20, 2025

22నే పంచాయతీ పాలకవర్గాల తొలి భేటీ

image

TG: పంచాయతీల్లో కొత్త పాలకవర్గాల తొలి సమావేశం 22వ తేదీన నిర్వహించనున్నారు. ఈమేరకు పంచాయతీరాజ్ శాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీచేసింది. ముందుగా పంచాయతీ కార్యాలయాల్లో కొత్తగా ఎన్నికైన సర్పంచులు, వార్డు మెంబర్లతో అధికారులు ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అనంతరం పాలకవర్గాలు సమావేశమై చర్చిస్తాయి. కాగా 18 జిల్లాల్లో 90 పంచాయతీల్లో నిలిచిపోయిన ఉప సర్పంచ్ ఎన్నికను ఈసీ ఆదేశాలతో అధికారులు ఈరోజు నిర్వహిస్తున్నారు.

News December 20, 2025

గుడ్లు తింటే క్యాన్సర్ రాదు: FSSAI

image

గుడ్లను తింటే క్యాన్సర్ వస్తుందని <<18572969>>జరుగుతున్న<<>> ప్రచారాన్ని FSSAI ఖండించింది. కోళ్ల పెంపకం, గుడ్ల ఉత్పత్తిలో ప్రమాదకర నైట్రోఫ్యూరాన్‌లు, యాంటీబయాటిక్‌లపై నిషేధం కొనసాగుతోందని తెలిపింది. ‘గరిష్ఠంగా KGకి 1.0 మైక్రోగ్రామ్ నైట్రోఫ్యూరాన్లు ఉండొచ్చు. వీటివల్ల ప్రమాదం లేదు. ఫుడ్ సేఫ్టీ వయలేషన్‌గా పరిగణించలేం. నైట్రోఫ్యూరాన్లకు క్యాన్సర్‌కు సంబంధం లేదు. మన దేశంలో గుడ్లు సురక్షితం’ అని స్పష్టం చేసింది.

News December 20, 2025

APPLY NOW: APEDAలో ఉద్యోగాలు

image

<>APEDA<<>> 5 AGM పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల వారు JAN 20 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి PG(అగ్రికల్చర్/హార్టికల్చర్/ప్లాంటేషన్/అగ్రికల్చర్ Engg./వెటర్నరీ సైన్స్/ఫుడ్ ప్రాసెసింగ్), MBA, డిగ్రీ(ఫారెన్ ట్రేడ్, ఇంటర్నేషనల్ బిజినెస్, ఇంటర్నేషనల్ ట్రేడ్, అగ్రికల్చర్ బిజినెస్ మేనేజ్‌మెంట్) ఉత్తీర్ణులు అర్హులు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: apeda.gov.in