News February 15, 2026

IITల్లో అకాడమిక్ ఎక్స్‌ఛేంజ్.. వేరే క్యాంపస్‌కు వెళ్లి చదువుకునే ఛాన్స్

image

IITలు వచ్చే విద్యా సంవత్సరం నుంచి అకాడమిక్ ఎక్స్‌ఛేంజ్ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు సమాచారం. TOI కథనం ప్రకారం.. విద్యార్థులు ఒక సెమిస్టర్ పాటు ఇతర IIT క్యాంపస్‌లలో చదువుకోవచ్చు. అక్కడ సంపాదించిన క్రెడిట్లను వారి సొంత IIT గుర్తిస్తుంది. కేవలం ర్యాంకుకు పరిమితం కాకుండా విద్యార్థులకు నచ్చిన కోర్సులను ఇతర IITల్లో నేర్చుకునే స్వేచ్ఛను కల్పించడమే ఈ నిర్ణయం వెనక ఉద్దేశం.

Similar News

News February 15, 2026

పవర్ ప్లేలో భారత్ స్కోర్ 52-1

image

T20WC: తొలి ఓవర్లోనే అభిషేక్ ఔటైనా ఇషాన్ కిషన్(42*) ధనాధన్ ఆటతో భారత్ పవర్ ప్లే ముగిసే వరకు 52 పరుగులు చేసింది. అటు తిలక్ వర్మ(10*) ఆచితూచి ఆడుతున్నారు. తొలి 6 ఓవర్లలో 5 ఓవర్లను పాక్ స్పిన్నర్లతోనే వేయించడం విశేషం.

News February 15, 2026

మహా శివరాత్రి జాగరణ చేస్తున్నారా?

image

ఇవాళ మహాశివరాత్రి జాగరణ మనలోని శివత్వాన్ని మేల్కొలుపుతుందని పండితులు చెబుతున్నారు. ఇవాళ రాత్రంతా జాగరణ చేస్తే ఎంతో పుణ్యం వస్తుందంటున్నారు. అయితే సినిమాలు చూస్తూ, పిచ్చి కబుర్లు చెప్పుకుంటూ, డాన్సులు చేసేది జాగరణ కాదని స్పష్టం చేస్తున్నారు. కునికిపాట్లు పడకుండా శివ నామాలను భక్తితో స్మరించాలని సూచిస్తున్నారు. అర్ధరాత్రి 12.03 గంటల నుంచి 12.53 వరకు లింగోద్భవ కాలంలో పూజలు, అభిషేకం చేయాలంటున్నారు.

News February 15, 2026

తీవ్ర నిరాశకు గురి చేసిన అభిషేక్

image

T20WC: హైఓల్టేజ్ మ్యాచ్‌లో పాక్ బౌలర్లకు చుక్కలు చూపిస్తారనుకున్న ఓపెనర్ అభిషేక్ ఘోరంగా విఫలమయ్యారు. కనీసం ఖాతా తెరవకుండా ఔటవడంపై టీమ్ఇండియా ఫ్యాన్స్ తీవ్ర నిరాశ చెందారు. పవర్ ప్లే వరకు ఆడినా పెద్ద స్కోర్ వస్తుందని ఆశించగా తొలి ఓవర్లోనే చెత్త షాట్ ఆడి పెవిలియన్‌కు చేరారు. మీరేమంటారు?