News April 4, 2025

IIT హైదరాబాద్‌కు విరాళమిస్తే నో టాక్స్

image

ప్రముఖ విద్యాసంస్థ ఐఐటీ హైదరాబాద్‌కు విరాళమిచ్చే వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్ ప్రకటించింది. ఈ విద్యా సంస్థకు విరాళం ఇస్తే ఆ మొత్తానికి సంబంధించి టాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపింది. గతంలో 50% పన్ను చెల్లించాల్సి ఉండేది. అయితే ఇపుడు ఐటీ యాక్ట్ సెక్షన్ 80జీ ప్రకారం విరాళాలు టాక్స్ ఫ్రీ అని ఐఐటీహెచ్ డైరెక్టర్ ప్రొ.బీఎస్ మూర్తి తెలిపారు.

Similar News

News December 9, 2025

HYD: గ్లోబల్ సమ్మిట్‌లో తెలంగాణ సంస్కృతి, రుచులకు పెద్దపీట

image

హైదరాబాద్‌లో జరుగుతున్న గ్లోబల్ సమ్మిట్‌లో విదేశీ అతిథులను మంత్రముగ్ధులను చేసేందుకు తెలంగాణ సంస్కృతి, రుచులకు పెద్దపీట వేశారు. శక్తివంతమైన గుస్సాడీ, బోనాలు, పేరిణి శివతాండవం వంటి నృత్యాలను ప్రదర్శిస్తున్నారు. అతిథులకు ప్రత్యేకంగా ‘తెలంగాణ మెనూ’ను సిద్ధం చేశారు. ఇందులో సకినాలు, సర్వపిండి, దమ్ బిర్యానీ, హలీమ్ వంటి సాంప్రదాయ వంటకాలు ఉన్నాయి.

News December 8, 2025

Global summit‌: ఆకాశంలో తెలంగాణ ప్రగతి చిత్రం

image

Global summit‌లో 3,000 డ్రోన్లతో కూడిన లేజర్ లైటింగ్ షో ఏర్పాట్లు పూర్తయ్యాయి. వినోదం కోసమే కాకుండా TG అభివృద్ధి ప్రస్థానం, సాంకేతిక ఆవిష్కరణలను ప్రపంచానికి చాటిచెప్పడానికి ఉద్దేశించిన కార్యక్రమం. ఆకాశంలో తెలంగాణ చిహ్నాలు, రాష్ట్ర ప్రభుత్వ కీలక పథకాలు, పారిశ్రామిక విజయాన్ని ప్రతిబింబించే దృశ్యాలను ఆవిష్కరిస్తుంది. ‘HYD ఫార్మా హబ్’, AI సిటీ’ విజన్లను డ్రోన్ల ద్వారా 3D రూపంలో ప్రదర్శించనున్నారు.

News December 8, 2025

ఫ్యూచర్ సిటీలోని ప్రదర్శన స్టాల్ వద్ద సందడి!

image

ఫ్యూచర్ సిటీలో ప్రదర్శన స్టాల్ ముఖ్య ఆకర్షణగా నిలిచింది. మీర్‌ఖాన్‌పేటలో ప్రతిపాదించిన ఈ భవిష్యత్తు నగర ప్రణాళికలను డిజిటల్ విజువల్స్ ద్వారా ప్రదర్శించారు. వంపు ఆకృతి నిర్మాణంతో కూడిన ఈ స్టాల్‌లో 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యంగా రూపొందించిన మాస్టర్ ప్లాన్‌ను అధికారులు వివరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్టాల్‌ను సందర్శించారు.