News January 19, 2025

IIT బాబాను ఆశ్రమం నుంచి పంపించేశారు!

image

మహాకుంభమేళాకు వచ్చిన IIT బాబా (అభయ్ సింగ్) SMలో వైరలైన విషయం తెలిసిందే. అయితే తాను ఉంటున్న ఆశ్రమం నుంచి పంపించేశారని ఆయన మీడియాతో తెలిపారు. ఆశ్రమ గురువు మహంత్ సోమేశ్వర్ పూరీని దూషించడమే దీనికి కారణమని తెలుస్తోంది. ‘అర్ధరాత్రి నిర్వాహకులు వెళ్లిపోవాలన్నారు. తనకు మతిస్థిమితం లేదన్నారు. అక్కడ నాకంటే మానసిక స్థితి తెలిసిన సైకాలజిస్టులు ఉన్నారా? నాకు సర్టిఫికెట్ ఇవ్వడానికి’ అంటూ అభయ్ మండిపడ్డారు.

Similar News

News January 22, 2026

ముగిసిన విజయసాయి రెడ్డి ఈడీ విచారణ

image

AP: మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి ఈడీ విచారణ ముగిసింది. లిక్కర్ స్కామ్ కేసులో హైదరాబాద్‌ కార్యాలయంలో ఆయనను సుమారు 7 గంటల పాటు విచారించింది. పాలసీ విధాన నిర్ణయాలు, రహస్య ఆర్థిక లావాదేవీలపై ఆరా తీసిన ఈడీ అధికారులు విజయసాయి స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేశారు. ఆర్థిక లావాదేవీలపై అధికారులకు ఆయన కొన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేశారు.

News January 22, 2026

500 వికెట్లు.. జలజ్ సక్సేనా రికార్డు

image

మహారాష్ట్ర ప్లేయర్ జలజ్ సక్సేనా (39 Yrs) దేశవాళీ క్రికెట్‌లో అరుదైన ఘనత సాధించారు. ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ కూడా ఆడకుండానే ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 500 వికెట్లు తీసిన ప్లేయర్‌గా రికార్డు సృష్టించారు. పుణెలో గోవాతో జరిగిన మ్యాచ్‌లో 4 వికెట్లు తీసి ఈ మైలురాయిని అందుకున్నారు. అదే విధంగా 156 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 7,202 పరుగులు సైతం చేశారు. జలజ్ కంటే ముందు ఫస్ట్ క్లాస్‌లో 18 మంది 500 వికెట్లు తీశారు.

News January 22, 2026

5 ఏళ్లలో 14.88 లక్షల మందికి కుక్కకాట్లు

image

TG: పల్లె నుంచి పట్నం వరకు కుక్క కాట్ల ఘటనలు పెరుగుతున్నాయి. రాష్ట్రంలో 5 ఏళ్లలో ఏకంగా 14,88,781 మంది కుక్క కాట్లకు గురయ్యారు. యూత్ ఫ‌ర్ యాంటీ క‌ర‌ప్ష‌న్ సంస్థ RTI ద్వారా అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ వివరాలు వెల్లడించింది. 2020-2025 మధ్య కుక్క కాటుకు గురైన వారి సంఖ్యను తెలిపింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా 36,07,989 రేబిస్ వ్యాక్సిన్ ఇచ్చినట్లు పేర్కొంది. 21,466 మంది పాము కాటుకు గురయ్యారంది.