News November 7, 2024
ఇండియాలో IIT ఢిల్లీ టాప్
భారతదేశంలోని విశ్వవిద్యాలయాల ర్యాంకింగ్స్‌ను QS ఆసియా విడుదలచేసింది. ఈ సంవత్సరం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఢిల్లీ IIT బాంబేను అధిగమించి అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. గతేడాది ఆసియాలో 46వ స్థానంలో ఉన్న IIT ఢిల్లీ, 44వ స్థానానికి ఎగబాకింది. ఆ తర్వాతి స్థానాల్లో IIT బాంబే, IIT మద్రాస్, IIT ఖరగ్‌పూర్, IISc బెంగళూరు, IIT కాన్పూర్, యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ, IIT గౌహతి, IIT రూర్కీ, JNU ఢిల్లీ ఉన్నాయి.
Similar News
News November 7, 2024
ట్రంప్ విజయం.. మస్క్‌కు ₹2.2లక్షల కోట్లు లాభం
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ గెలుపొందడంతో స్టాక్ మార్కెట్లు భారీ లాభాలను పొందాయి. దీంతో ఐదుగురు బిలియనీర్లు దాదాపు 53 బిలియన్ డాలర్లు లాభపడ్డారు. ముఖ్యంగా ట్రంప్‌కు మద్దతుగా ప్రచారానికి $119 మిలియన్లు విరాళమిచ్చిన ఎలాన్ మస్క్ ఒక్కరోజులో $26.5 బిలియన్లు (రూ.2.2లక్షల కోట్లు) లాభపడ్డారు. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం మస్క్ నికర విలువ $26.5B పెరిగి $290 బిలియన్లకు చేరింది.
News November 7, 2024
ట్రంప్ 2.0: డెమోక్రాట్లను జైలుకు పంపిస్తారా?
డొనాల్డ్ ట్రంప్ కొందరు డెమోక్రాట్లపై ప్రతీకారం తీర్చుకోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. 2020 ఎన్నికల్లో భారీ స్థాయిలో రిగ్గింగ్ జరిగిందని, తాను ఓడిపోలేదని, ఓటమిని అంగీకరించి వైట్‌హౌస్‌ను వీడాల్సింది కాదని ఆయన చెప్పడాన్ని గుర్తు చేస్తున్నారు. దీనిపై ఆయన విచారణకు ఆదేశించే అవకాశాన్ని కొట్టిపారేయలేం అంటున్నారు. చివరి 5 ఎన్నికల్లో డెమోక్రాట్లకు ఎప్పుడూ పడనన్ని ఓట్లు (8CR) బైడెన్‌కు రావడం గమనార్హం.
News November 7, 2024
రైతు బాంధవుడు ఎన్జీ రంగా (1/2)
రైతుల బాధలపై పార్లమెంట్లో బలమైన గొంతుక వినిపించిన గొప్ప నేత గోగినేని రంగారావు(NG రంగా). గుంటూరు(D) నిడుబ్రోలులో 1900 NOV 7న జన్మించారు. రైతు ఉద్యమాలను స్వాతంత్ర్య పోరాటంలో భాగం చేశారు. జమిందారీ విధానానికి ఎదురొడ్డి నిలిచారు. నీతివంతంగా, నిరాడంబరంగా జీవించిన ఆయన పదవులకు ఏనాడూ ఆశ పడలేదు. 1952లో కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి స్వతంత్ర పార్టీ స్థాపించారు. 1997లో వ్యవసాయ కాలేజీకి NG రంగా పేరు పెట్టారు.