News September 25, 2024
జియోగ్రిడ్ల తయారీకి IIT HYD, ఇండోర్ శ్రీకారం

తాజ్ మహల్ నిర్మాణ శైలి, భారతీయ నక్షత్ర తాబేలుపై కనిపించే నమూనాల నుంచి ప్రేరణ పొంది జియోగ్రిడ్ల తయారీకి IIT ఇండోర్ – IIT HYD చేతులు కలిపాయి. జియోగ్రిడ్లు మట్టిలో స్థిరత్వం, లోడ్ బేరింగ్ సామర్థ్యం పెంపునకు ఉపకరిస్తాయి. నేల కోత – కొండచరియలు విరిగిపడకుండా నిరోధించడానికి, రోడ్లు, వంతెనల నిర్మాణాలకు స్థిరమైన పునాదిని అందించడానికి ఇందులో జియో సింథటిక్ పదార్థాలను ఉపయోగిస్తారు.
Similar News
News December 10, 2025
తాజా సినీ ముచ్చట్లు

* యాంటీ ఏజింగ్ రీసెర్చ్ చేసేవాళ్లు కొన్నిరోజులు అక్కినేని నాగార్జున గారిపై పరిశోధనలు చేయాలి: విజయ్ సేతుపతి
* రోషన్ కనకాల-సందీప్ రాజ్ కాంబోలో వస్తున్న ‘మోగ్లీ’ చిత్రానికి ‘A’ సర్టిఫికెట్
* రాబోయే ఐదేళ్లలో దక్షిణాదిన రూ.12 వేల కోట్లతో కంటెంట్ని సృష్టించబోతున్నట్లు ప్రకటించిన జియో హాట్ స్టార్
* ‘అన్నగారు వస్తారు’ నాకో ఛాలెంజింగ్ చిత్రం: హీరో కార్తి
News December 10, 2025
చిన్నారులకు విటమిన్ డి ఎందుకు అవసరమంటే?

పిల్లల ఎముకలు,కండరాల ఆరోగ్యం విషయంలో విటమిన్ D పాత్ర చాలా ముఖ్యమైనది. రోగనిరోధక వ్యవస్థ పనితీరుతో పాటు మొత్తం శరీర ఆరోగ్యంలో D విటమిన్ కీలకపాత్ర పోషిస్తుంది. విటమిన్ D లోపం కారణంగా అనేక రకాల సమస్యలు తలెత్తుతాయి. కీళ్ల నొప్పులు, నిరంతరం అలసట, జుట్టు పల్చబడటం, గాయాలు నెమ్మదిగా మానడం మొదలైనవి విటమిన్ D లోపానికి సంకేతాలు. ఈ లక్షణాలు పిల్లల ఆరోగ్యంపై తీవ్రంగా ప్రభావం చూపిస్తాయి.
News December 10, 2025
మరోసారి ఇండిగో విమానాల రద్దు

ఇండిగో విమానాల రద్దు మళ్లీ మొదలైంది. ఇవాళ దేశవ్యాప్తంగా సుమారు 300 సర్వీసులు క్యాన్సిల్ అయ్యాయి. ఢిల్లీ ఎయిర్పోర్టులో 137, ముంబైలో 21, బెంగళూరులో 61 ఫ్లైట్స్ నిలిచిపోయాయి. శంషాబాద్ నుంచి బయల్దేరాల్సిన 70 విమానాలు కూడా రద్దయినట్లు తెలుస్తోంది. తీవ్ర సంక్షోభం తర్వాత తమ ఫ్లైట్స్ సర్వీసెస్ సాధారణ స్థితికి చేరాయని నిన్న ఇండిగో సీఈవో పీటర్ ప్రకటించిన గంటల వ్యవధిలోనే మరోసారి విమాన సర్వీసులు రద్దయ్యాయి.


