News April 7, 2025

IITHYDకు INE హోదా.. 100% IT మినహాయింపు!

image

IIT హైదరాబాద్‌కు (IITH) కు ఇనిస్టిట్యూషనల్ ఆఫ్ నేషనల్ ఏమినాన్స్ (INE)’ హోదా లభించినట్లు డైరెక్టర్ ప్రొ.మూర్తి ప్రకటించారు. ఈ హోదాతో ఇప్పుడు IITHకి ఇచ్చే విరాళాలపై 100% ఆదాయపు పన్ను మినహాయింపు వర్తించనుందని చెప్పారు. ఇప్పటి వరకు ప్రతిష్ఠాత్మక సంస్థలకు 50% మినహాయింపే ఉన్నా, తమకు 100% మినహాయింపు లభించడాన్ని గర్వకారణంగా అభివర్ణించారు.

Similar News

News September 18, 2025

అరాచకమే.. సందీప్ వంగాతో మహేశ్ మూవీ?

image

రాజమౌళితో సినిమా తర్వాత మహేశ్ బాబు చేసే మూవీ విషయమై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. దీని కోసం మైత్రీ మూవీ మేకర్స్, ఏషియన్ సునీల్ పోటీలో ఉన్నట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. దర్శకుడు సందీప్ రెడ్డి వంగాతో మూవీ చేయాలని మహేశ్‌ను సునీల్ కోరినట్లు తెలిపాయి. కాల్షీట్ల ఆధారంగా దీనిపై నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉందన్నాయి. దీంతో సందీప్, మహేశ్ కాంబినేషన్ కుదిరితే అరాచకమేనని ఫ్యాన్స్ పోస్టులు చేస్తున్నారు.

News September 18, 2025

పూసపాటిరేగ: వేటకు వెళ్లి మృతి

image

పూసపాటిరేగ మండలం పెద్దూరుకు చెందిన ఓ మత్స్యకారుడు వేటకు వెళ్లి మృతి చెందాడు. ఈ ఘటనపై స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మత్స్యకారుడైన బి.రాము బుధవారం వేటకు వెళ్లగా.. చేపల కోసం వల వేసే క్రమంలో జారి పడిపోయాడు. అక్కడున్నవారు కాపాడే ప్రయత్నం చేసినా ఫలించలేదు. ఈ ఘటనపై మెరైన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News September 18, 2025

ప్రకాశం ఎస్పీ గారూ.. ప్లీజ్ ఈవ్ టీజింగ్‌పై లుక్కేయండి!

image

ప్రకాశం జిల్లా నూతన SP హర్షవర్ధన్ రాజు ఇటీవల బాధ్యతలు చేపట్టారు. తిరుపతిలో SPగా ఉన్నప్పుడు ఈవ్ టీజింగ్‌పై ఉక్కుపాదం మోపారు. ఇప్పుడు ప్రకాశంలో కూడా అదే తీరు చూపాలని విద్యార్థి సంఘాలు కోరుతున్నాయి. స్కూల్స్, కళాశాలలు మొదలు, ముగిసే సమయాల్లో పోకిరీల ఆగడాలు పెరిగాయని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. SP చొరవ తీసుకోవాలని వారు కోరారు.