News April 20, 2024

హైదరాబాద్‌లోని ఐకియాకు జరిమానా

image

దుకాణాలు తాము అమ్మిన వస్తువుల ప్యాకింగ్‌కు లేదా క్యారీ బ్యాగ్ ఛార్జీలను అదనంగా వసూలు చేయకూడదు. కానీ HYDలోని ఐకియా క్యారీ బ్యాగ్‌కు ఓ కస్టమర్‌ నుంచి రూ.20 వసూలు చేసింది. అతడు రంగారెడ్డి జిల్లా వినియోగదారుల హక్కుల కమిషన్‌ను ఆశ్రయించగా.. ఐకియాకు రూ.1000 ఫైన్ పడింది. ఆ మొత్తాన్ని కస్టమర్‌కు 45 రోజుల్లోపు చెల్లించకపోతే రూ.5వేలు ప్లస్ ఏడాదికి 24% వడ్డీ లెక్కన ఇవ్వాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.

Similar News

News November 19, 2024

కృత్రిమ వర్షం కురిపించండి.. కేంద్రానికి మంత్రి రిక్వెస్ట్

image

ఢిల్లీలో తీవ్ర కాలుష్యం ఉందని, ఇందుకు కృత్రిమ వర్షమే ఏకైక పరిష్కారం అని ఆ రాష్ట్ర పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ తెలిపారు. ప్రధాని మోదీ జోక్యం చేసుకుని కాలుష్య నియంత్రణకు చర్యలు తీసుకోవాలని కోరారు. కృత్రిమ వర్షంపై గత 3 నెలలుగా కేంద్రానికి లేఖలు రాస్తున్నా పట్టించుకోవడం లేదని వాపోయారు. దీనిపై కేంద్ర పర్యావరణశాఖ అత్యవసర సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

News November 19, 2024

బుల్స్ బ్యాటింగ్: 1000 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్

image

దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. నిఫ్టీ 300, సెన్సెక్స్ 1000 పాయింట్లకు పైగా ఎగిశాయి. దీంతో ఇన్వెస్టర్ల సంపద రూ.6లక్షల కోట్లమేర పెరిగింది. గ్లోబల్ మార్కెట్ల నుంచి పాజిటివ్ సిగ్నల్స్, డాలర్ దూకుడు తగ్గడం, FIIలు తిరిగొస్తుండటమే ఇందుకు కారణాలు. బ్యాంకింగ్, మీడియా, రియాల్టి, కన్జూమర్ డ్యురబుల్స్, O&G షేర్లకు డిమాండ్ పెరిగింది. 200DEMA లెవల్ నుంచి నిఫ్టీ బౌన్స్‌బ్యాక్ అయింది.

News November 19, 2024

తిరుమల వెళ్తున్నారా? ఇవి తెలుసుకోండి!

image

శ్రీవారి దర్శనానికి వెళ్లిన వారికి రూమ్స్ దొరక్కపోతే లాకర్స్‌ అందుబాటులో ఉంటాయి. వాటిలో వస్తువులను భద్రపరిచి సేదతీరేందుకు, కాలకృత్యాలు తీర్చుకునేందుకు ఉచిత మండపాలున్నాయి. తిరుమల బస్‌స్టాండుకు ఎదురుగా ఉన్న యాత్రి సదన్, యాత్రి సదన్-3 & పక్కనే ఉన్న పద్మనాభ నిలయం, ఇండియన్ పెట్రోల్ బంక్ ఎదురుగా ఉన్న మాధవ నిలయంలో లాకర్స్ అందుబాటులో ఉంటాయి. వసతి కౌంటర్లు ఉదయం 4 నుంచి మధ్యాహ్నం 12 వరకు అందుబాటులో ఉంటాయి.