News January 7, 2025
డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా కేటీఆర్పై అక్రమ కేసులు: హరీశ్ రావు

TG: ఫార్ములా-e రేస్ కేసులో KTR క్వాష్ పిటిషన్ను హైకోర్టు కొట్టేయడంపై న్యాయ నిపుణులతో చర్చిస్తున్నట్లు హరీశ్ రావు చెప్పారు. ‘ఏడాది పాలన తర్వాత ప్రభుత్వం ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. CM రేవంత్ డైవర్షన్ పాలిటిక్స్, కక్ష సాధింపులో భాగంగా KTRపై అక్రమ కేసులు నమోదుచేశారు. ఆయన ఎలాంటి అవినీతికి పాల్పడలేదు. ఎన్ని కేసులు పెట్టినా మా పోరాటం ఆగదు. అక్రమాలను ప్రశ్నిస్తూనే ఉంటాం’ అని స్పష్టం చేశారు.
Similar News
News January 9, 2026
ప్రధానమంత్రితో నేరుగా మాట్లాడే అవకాశం..

ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో విద్యార్థులు నేరుగా మాట్లాడే అవకాశం కేంద్ర ప్రభుత్వం కల్పించింది. పరీక్ష పే చర్చ 2026 కార్యక్రమం ద్వారా ఈ అవకాశం పొందవచ్చు. పరీక్షల సమయంలో ఒత్తిడి లేకుండా ఎలా సిద్ధం కావాలనే విషయాలపై ఈ చర్చ నడుస్తుంది. ప్రధాని రాసిన ఎగ్జామ్ వారియర్స్ పుస్తకం తెలుగులో కూడా అందుబాటులో ఉంది.
News January 9, 2026
9వేల ప్రభుత్వ పాఠశాలల్లో సౌర విద్యుత్!

తెలంగాణలోని 9,937 ప్రభుత్వ పాఠశాలల్లో సౌర విద్యుత్ సరఫరా వ్యవస్థలను సర్కార్ ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్టు కోసం ₹290Cr వ్యయంతో టెండర్లను ఆహ్వానించారు. రాష్ట్ర ఇంధన&పునరుత్పాదక ఇంధన విభాగాలు వచ్చే నెల నాటికి టెండర్లను ఖరారు చేయనున్నాయి. స్కూళ్లలో సౌర విద్యుత్ సరఫరా నెట్వర్క్ను అభివృద్ధి చేసే బాధ్యతను ఇంధన శాఖ ప్రత్యేక కార్యదర్శి నవీన్ మిట్టల్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల కమిటీకి అప్పగించారు.
News January 9, 2026
‘పరాశక్తి’ విడుదలకు లైన్ క్లియర్.. U/A సర్టిఫికెట్

శివకార్తికేయన్ ‘పరాశక్తి’ సినిమాకు లైన్ క్లియర్ అయింది. సెన్సార్ బోర్డు U/A సర్టిఫికెట్ జారీ చేసింది. రేపు విడుదల కావాల్సి ఉన్న ఈ చిత్రంలో అభ్యంతరకర సన్నివేశాలున్నాయంటూ సెన్సార్ బోర్డు ఇవాళ్టి వరకు సర్టిఫికెట్ ఇవ్వలేదు. అయితే ఆయా సన్నివేశాలను మేకర్స్ తొలగించడంతో తాజాగా సర్టిఫికెట్ జారీ చేసింది. దీంతో పరాశక్తి యథావిధిగా రేపు రిలీజ్ కానుంది.


