News October 6, 2024
18 ఏళ్లపాటు రూ.49 వేల కోట్లు అక్రమంగా వసూలు!

అధిక రాబడులు ఆశచూపి రూ.వేల కోట్లు అక్రమంగా వసూలు చేసిందన్న ఆరోపణలపై పెరల్ ఆగ్రో కార్పొరేషన్ లిమిటెడ్ పై ఈడీ విచారణ జరుపుతోంది. 18 ఏళ్లపాటు దేశవ్యాప్తంగా 5.8 కోట్ల మంది నుంచి సదరు సంస్థ ఏకంగా రూ.49 వేల కోట్లు వసూలు చేసినట్టు తెలుస్తోంది. దీనిపై కేసు నమోదు చేసిన ఈడీ తాజాగా తెలంగాణ సహా దేశవ్యాప్తంగా 44 చోట్ల సంస్థకు చెందిన ఆఫీసుల్లో సోదాలు నిర్వహించి కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకుంది.
Similar News
News March 30, 2026
పాకిస్థాన్‌కు షాకిచ్చిన ఇరాన్

అమెరికా-ఇరాన్ మధ్య శాంతి చర్చలపై మధ్యవర్తిత్వానికి పాకులాడుతున్న పాకిస్థాన్‌కు షాక్ తగిలింది. ఆ దేశ నేతల ప్రకటనలను ఇరాన్ ఖండించింది. పాక్ వేదికలపై చర్చల్లో తాము పాల్గొనలేదని ముంబైలోని ఇరాన్ కాన్సులేట్ జనరల్ Xలో స్పష్టం చేసింది. ‘అమెరికాతో ప్రత్యక్ష చర్చల్లేవు. వారు మధ్యవర్తుల ద్వారా అసమంజసమైన డిమాండ్లు చేస్తున్నారు. US దౌత్య విధానాలు నిత్యం మారుతున్నాయి’ అని పేర్కొంది.
News March 30, 2026
OTTలోకి రాధిక ‘తాయ్ కిళవి’

సీనియర్ నటి రాధికా శరత్‌కుమార్ నటించిన <<19338573>>‘తాయ్ కిళవి’<<>> ఓటీటీ రిలీజ్ డేట్ ఖరారైంది. ఏప్రిల్ 10 నుంచి జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. తమిళంతో పాటు ఇతర భాషల్లోనూ అందుబాటులో ఉండే అవకాశం ఉంది. ఈ మూవీలో 70 ఏళ్ల వడ్డీ వ్యాపారి పాత్రలో రాధిక నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. దాదాపు రూ.75 కోట్ల కలెక్షన్లతో ఈ చిత్రం బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.
News March 30, 2026
టీవీకే చీఫ్ విజయ్‌కి రూ.520 కోట్ల ఆస్తులు!

TVK చీఫ్ విజయ్ తనకు ₹520Cr+ (₹405Cr చరాస్తులు, ₹115Cr స్థిరాస్తులు) ఆస్తులున్నట్లు ఎన్నికల అఫిడవిట్‌లో వెల్లడించారు. భార్య సంగీత పేరిట ₹15Cr+ చరాస్తులు, ₹2.5Cr స్థిరాస్తులు, ₹85Cr బ్యాంక్ డిపాజిట్లు ఉన్నట్లు తెలిపారు. విజయ్ వద్ద 800gm+ బంగారం, సంగీత వద్ద 3kg+ గోల్డ్, ₹కోటి విలువైన డైమండ్స్, 2kgs వెండి ఉంది. ₹2L నగదు, BMW 530Li, BMW i7తో పాటు మరికొన్ని వాహనాలు ఉన్నాయని, అప్పులు లేవని పేర్కొన్నారు.


