News November 11, 2024

ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ అమెరికాను వీడాల్సిందే: వివేక్

image

USలో లీగల్ ఇమ్మిగ్రేషన్ వ్యవస్థ నాశనమైందని టాప్ ఇండియన్ అమెరికన్ వివేక్ రామస్వామి అన్నారు. ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్‌ను వెనక్కి పంపడాన్ని తాను సమర్థిస్తానని తెలిపారు. ‘అక్రమంగా ప్రవేశించి నేరం చేసినవాళ్లు లక్షల్లో ఉన్నప్పటికీ దేశం నుంచి వెళ్లిపోవాల్సిందే. వాళ్లకు ప్రభుత్వ సాయం నిలిపేస్తాం. సొంతంగా వెళ్లిపోవడాన్నీ మీరు చూస్తారు’ అని అన్నారు. ట్రంప్ క్యాబినెట్లో చోటిస్తే పనిచేస్తానని వెల్లడించారు.

Similar News

News December 5, 2025

కడప: మేయర్ స్థానానికి ఎన్నిక.. ఆశావహులు వీరే.!

image

కడప మేయర్ స్థానానికి నోటిఫికేషన్ విడుదల కావడంతో ఈ స్థానానికి సంబంధించి చాలామంది పోటీలో ఉన్నారు. ఇప్పటివరకు సురేశ్ బాబు మేయరుగా కొనసాగారు. ఆయనపై అనర్హత వేటు వేయడంతో నూతన ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. అయితే మొత్తం 50 మంది కార్పొరేటర్లు ఉంటే వైసీపీకి 39 మంది సపోర్టు ఉంది. దీంతో పాకా సురేశ్, బసవరాజు, గంగాదేవి, మల్లికార్జున, శ్రీలేఖతో పాటు మరి కొంతమంది కార్పొరేటర్లు మేయర్ బరిలో ఉన్నారు.

News December 5, 2025

పుతిన్ పర్యటన.. నేడు కీలకం!

image

రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇవాళ ఇండియా-రష్యా 23వ వార్షిక సమ్మిట్‌లో పాల్గొననున్నారు. 11.50గం.కు <<18467026>>హైదరాబాద్‌ హౌస్‌<<>>లో ఈ మీటింగ్ జరగనుంది. రక్షణ బంధాల బలోపేతం, వాణిజ్యం, పౌర అణు ఇంధన సహకారం వంటి అంశాలపై PM మోదీతో చర్చించనున్నారు. S-400, మిసైళ్ల కొనుగోలు, రూపే-మిర్ అనుసంధానం సహా 25 వరకు కీలక ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉంది. అధునాతన S-500 వ్యవస్థ, SU-57 విమానాల కొనుగోలుపైనా చర్చలు జరపనున్నారు.

News December 5, 2025

స్క్రబ్ టైఫస్ వ్యాధి.. ఈ జాగ్రత్తలు తీసుకోవాలి

image

స్క్రబ్ టైఫస్‌ను వ్యాప్తి చేసే పురుగు పొలాలు, అడవులు, పశుగ్రాసం, తడి నేలల్లో ఎక్కువగా ఉంటోంది. పొలం పనులకు, పశుగ్రాస సేకరణకు వెళ్లే రైతులు తప్పనిసరిగా రబ్బరు బూట్లు, కాళ్లు, చేతులు పూర్తిగా కప్పి ఉంచే దుస్తులను వేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. తడిసిన దుస్తులు ధరించొద్దు. పొలాల్లో, పశువుల కొట్టాల్లో పనిచేసేటప్పుడు ఏదైనా పురుగు కుట్టి నొప్పి, జ్వరం, ఒళ్లు నొప్పులుంటే ఆస్పత్రికి తప్పక వెళ్లండి.