News September 13, 2024
నేనొక సీరియల్ డేటర్: రెజీనా

ఇప్పటివరకు తాను ఎంతో మందితో రిలేషన్‌షిప్‌లో ఉన్నానని హీరోయిన్ రెజీనా తెలిపారు. ‘ఉత్సవం’ ప్రమోషన్లలో తన లవ్ స్టోరీస్ గురించి ఆమె మాట్లాడారు. ‘నేను సీరియల్ డేటర్‌ను. చాలా మందితో రిలేషన్ కొనసాగించా. కానీ ఇప్పుడు అవన్నీ వదిలేసి విశ్రాంతి తీసుకుంటున్నా. సందీప్ కిషన్‌తో నాకు అఫైర్ లేదు. మేమిద్దరం మంచి స్నేహితులం’ అని ఆమె చెప్పారు. కాగా చాలా రోజుల తర్వాత రెజీనా ‘ఉత్సవం’ మూవీలో నటించారు.
Similar News
News March 20, 2026
ఎన్నికల బరిలో హత్యాచార బాధితురాలి తల్లి!

బెంగాల్ ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో <<15698320>>హత్యాచారానికి <<>>గురైన బాధితురాలి తల్లి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి సిద్ధమయ్యారు. పానీహటి నుంచి కంటెస్ట్ చేయాలనుకుంటున్నట్లు ఆమె వెల్లడించారు. గతంలో BJP తనకు టికెట్ ఆఫర్ చేసిందని చెప్పారు. ఇటీవల ఆ పార్టీ అభ్యర్థుల జాబితాను ప్రకటించగా పానీహటి సీటును పెండింగ్‌లో పెట్టింది. దీంతో ఆమెకే టికెట్ ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై అధిష్ఠానం తుది నిర్ణయం తీసుకోనుంది.
News March 20, 2026
భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 901 పాయింట్లు పెరిగి 75,109 వద్ద.. నిఫ్టీ 286 పాయింట్లు పుంజుకొని 23,288 వద్ద ట్రేడవుతోంది. నిన్నటి భారీ నష్టాలతో కీలక రంగాల్లో షేర్లు ఆకర్షణీయ ధరలకే లభిస్తుండడంతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు దిగుతున్నారు. మరోవైపు నిన్న భారీగా పెరిగిన చమురు ధరలు కాస్త దిగిరావడం కూడా కలిసొచ్చింది. సెన్సెక్స్-30 సూచీలో HDFC షేరు మాత్రమే నష్టాల్లో ఉంది.
News March 20, 2026
పూజ గదిలో బొమ్మపై విమర్శలు.. మంత్రి లోకేశ్ క్లారిటీ

AP: ఉగాది సందర్భంగా నిన్న కుమారుడు దేవాన్ష్‌తో కలిసి పూజలో పాల్గొన్న ఫొటోలను మంత్రి లోకేశ్ షేర్ చేశారు. అయితే పూజ గదిలో ఓ మూలన కనిపించిన చిన్నబొమ్మపై పలువురు విమర్శలు చేయగా మంత్రి కౌంటర్ ఇచ్చారు. నాలుగేళ్ల వయసులో దేవాన్ష్ చేసిన శివుడు, శివలింగం ఆకృతులను గుర్తుగా పూజగదిలో ఉంచామన్నారు. దేవుడిపై విశ్వాసాన్ని కొందరే అర్థం చేసుకుంటారని, అలాగే ఇలాంటి భక్తిని వివరించాల్సిన అవసరం లేదన్నారు.


