News April 13, 2025
ఆ సినిమాల కోసం ఎదురుచూస్తున్నా: రాజమౌళి

జపాన్‌లో పర్యటిస్తున్న రాజమౌళి అక్కడ మీడియాతో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రాబోతున్న ‘డ్రాగన్’ (ప్రచారంలో ఉన్న టైటిల్} మూవీకోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. అదే విధంగా ప్రభాస్ ‘స్పిరిట్’, రామ్ చరణ్ ‘పెద్ది’ మూవీలను చూడాలనుకుంటున్నానని పేర్కొన్నారు. ‘RRR బిహైండ్ అండ్ బియాండ్’ డాక్యుమెంటరీ ప్రమోషన్స్ కోసం రాజమౌళి జపాన్ వెళ్లారు.
Similar News
News April 15, 2025
నేటి నుంచి ఇంటింటికీ ‘మన మిత్ర’

AP: వాట్సాప్ గవర్నెన్స్‌పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం నేటి నుంచి ఇంటింటికీ ‘మన మిత్ర’ కార్యక్రమం చేపట్టనుంది. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ప్రతి ఒక్కరి స్మార్ట్ ఫోన్లో 9552300009 నంబర్‌ను సేవ్ చేస్తారు. దాన్ని ఉపయోగించే విధానాన్ని ప్రజలకు వివరిస్తారు. ప్రస్తుతం 250కిపైగా సేవలు వాట్సాప్‌లో అందుతుండగా జూన్ నాటికి ప్రభుత్వం 500 సేవలకు విస్తరించనుంది.
News April 15, 2025
ధోనీ రికార్డుల మీద రికార్డులు

CSK కెప్టెన్ ధోనీ నిన్నటి LSG మ్యాచ్‌లో రికార్డుల మీద రికార్డులు నమోదు చేశారు. IPLలో 200డిస్మిసల్స్(స్టంపౌట్లు, క్యాచ్‌లు, రనౌట్లు) చేసిన తొలి వికెట్ కీపర్‌గా నిలిచారు. అలాగే లీగ్ ప్రారంభం నుంచి అత్యధిక ఇన్నింగ్సుల్లో (132) సిక్సర్లు బాదిన బ్యాటర్‌గానూ ఘనత సాధించారు. మరోవైపు IPLలో అత్యధిక సార్లు(18) POTM అవార్డ్ గెలిచిన 2వ ప్లేయర్‌గా రికార్డులకెక్కారు. ఈ లిస్టులో తొలి స్థానంలో రోహిత్ (19) ఉన్నారు.
News April 15, 2025
అమరావతిలో 1,600 ఎకరాల్లో స్పోర్ట్స్ సిటీ!

AP: అమరావతి ప్రాంతంలో 1,600 ఎకరాల్లో స్పోర్ట్స్ సిటీ నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. కృష్ణా నదిపై నిర్మించే ఐకానిక్ బ్రిడ్జి పక్కనే దీనిని ఏర్పాటు చేస్తారని సమాచారం. మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం, ట్రాక్ అండ్ ఫీల్డ్ స్టేడియాలు, స్పోర్ట్స్ వర్సిటీ, స్పోర్ట్స్ విలేజ్ నిర్మిస్తారని తెలుస్తోంది. మరోవైపు ఈ ప్రాంతంలోనే 1.25 లక్షల మంది కెపాసిటీ గల భారీ క్రికెట్ స్టేడియం కూడా నిర్మించనున్నారు.