News March 15, 2025

‘ప్రపంచంతో పోటీ పడటంలేదు.. నా పిల్లల్ని చంపేస్తున్నా’

image

AP: 1వ తరగతి, UKG చదివే ఇద్దరు పిల్లల్ని అత్యంత క్రూరంగా హతమార్చాడో తండ్రి. ఈ ప్రపంచంతో పోటీ పడలేకపోతున్నారని, చంపేస్తున్నానంటూ సూసైడ్ నోట్ రాశాడు. కాకినాడ(D) సర్పవరం ONGCలో పనిచేస్తున్న చంద్రకిశోర్ భార్య, పిల్లలతో కలిసి నిన్న ఆఫీస్‌లో హోలీ వేడుకల్లో పాల్గొన్నాడు. తర్వాత పిల్లలను ఇంటికి తీసుకెళ్లి కాళ్లూ చేతులు తాళ్లతో కట్టేసి, నీటి బకెట్లో తలలు ముంచి చంపేశాడు. అనంతరం తానూ ఆత్మహత్య చేసుకున్నాడు.

Similar News

News November 4, 2025

శబరిమల యాత్రికులకు రూ.6కోట్లతో ఆస్పత్రి

image

శబరిమల యాత్రికుల కోసం రూ.6.12కోట్లతో కేరళ ప్రభుత్వం ఓ ఆస్పత్రిని నిర్మించబోతోంది. ఈ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి నీలక్కల్ వద్ద నేడు శంకుస్థాపన చేయనున్నారు. ఇందులో స్థానికులకూ వైద్యం అందించేలా ఏర్పాట్లు చేస్తామని హెల్త్ మినిస్టర్ వీణా జార్జ్ పేర్కొన్నారు. హాస్పిటల్ నిర్మాణానికి ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు భూమి కేటాయించిందని వెల్లడించారు. ఇందులో ఎమర్జెన్సీ, ICU, ECG విభాగాలుంటాయని తెలిపారు.

News November 4, 2025

దీపావళి, కార్తీక పౌర్ణమి రోజుల్లో బాణాసంచా ఎందుకు కాల్చుతారు?

image

భాద్రపద మాసంలో అంటువ్యాధులు వ్యాప్తి చెందుతాయి. వర్షాల కారణంగా భూమిపై విషపూరితమైన ఆవిరి పేరుకుపోతుంది. ఈ కలుషిత గాలిని పీల్చడం వలన రోగాలు వచ్చే ప్రమాదం ఉంది. అందుకే.. ఆశ్వయుజ, కార్తీక మాసాల్లో వచ్చే పర్వదినాల్లో పసుపు, గంధకం, సురేకారం వంటి ద్రవ్యాలతో తయారుచేసే బాణాసంచాను కాల్చుతారు. వీటి నుంచి వచ్చే విపరీత కాంతి, పెద్ద ధ్వని, పొగ.. ఇవన్నీ క్రిమి సంహారిణిగా పనిచేసి, వాతావరణాన్ని శుద్ధి చేస్తుంది.

News November 4, 2025

‘ప్రతి కదలికలో పరమేశ్వరుడిని చూడాలి’

image

జీవితంలో ప్రతి అంశాన్ని దైవారాధనగా భావించి, ప్రతి క్షణం పరమాత్మలో లీనమై జీవించడమే మానవ జీవిత లక్ష్యమని ‘భక్తి యోగం’ పేర్కొంది. ‘ఓ దేవా! నా ఆత్మ నీవే, నా బుద్ధియే పార్వతి. నా శరీరమే నీ గృహం. నా పంచప్రాణాలు నీ పరిచారకులు. నా ప్రతి అనుభవం నీకు చేసే పూజే. నా నిద్ర కూడా యోగ సమాధితో సమానం. నేను నడిచే ప్రతి అడుగు నీకు ప్రదక్షిణం. నేను పలికే ప్రతి మాట నీ స్తోత్రం’ అంటూ పరమాత్మను సేవించాలని సూచిస్తోంది.