News February 15, 2025
నాకు భయంగా ఉంది.. ఏం చేయాలో తెలియట్లే: యూట్యూబర్ రణ్‌వీర్

పేరెంట్స్‌పై చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలకు యూట్యూబర్ రణ్‌వీర్ అలహాబాదియా మరో సారి క్షమాపణలు చెప్పారు. తనతో పాటు కుటుంబాన్ని చంపేస్తామని బెదిరింపులు వస్తున్నాయన్నారు. తన తల్లి ఆసుపత్రిలోకి కొందరు చొరబాటుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. తనకు భయంగా ఉందని, ఏం చేయాలో అర్థమవ్వట్లేదన్నారు. అధికారులకు సహకరిస్తున్నామని, భారత న్యాయ, పోలీసు వ్యవస్థపై తనకు పూర్తి నమ్మకం ఉందని చెప్పారు.
Similar News
News November 9, 2025
శ్రీవారి తొలి సోపాన మార్గం ‘అలిపిరి’

తిరుపతి నుంచి తిరుమల శ్రీవారి ఆలయానికి కాలి నడకన వెళ్లేందుకు మొదటి మెట్టు అయిన మార్గమే ‘అలిపిరి’ సోపాన మార్గం. ఇది అలిపిరి వద్ద మొదలవుతుంది. పూర్వం కపిలతీర్థం నుంచి కొండదారి ఉండేది. భక్తుల సౌకర్యార్థం మట్లకుమార అనంతరాజు ఈ మార్గాన్ని పునరుద్ధరించి, నిర్మించారు. చారిత్రక ఆధారాల ప్రకారం.. ఈ ‘అనంతరాజు’ మార్గం అలిపిరి నుంచే మొదలై, భక్తులకు స్వామి సన్నిధికి చేరేందుకు సరళ దారిని చూపింది. <<-se>>#VINAROBHAGYAMU<<>>
News November 9, 2025
నాన్‌వెజ్ వండేటపుడు ఈ జాగ్రత్తలు తీసుకోండి

వంటగదిలో ఎంత శుభ్రత పాటించినా బ్యాక్టీరియా, వైరస్‌లు విజృంభిస్తూనే ఉంటాయి. ముఖ్యంగా నాన్‌వెజ్ వండే సమయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. మాంసాహారంపై ఉండే హానికర బ్యాక్టీరియా కిచెన్‌లో వృద్ధిచెంది మన శరీరంలోకి ప్రవేశిస్తాయి. కాబట్టి నాన్‌వెజ్ వండే ముందు, వండేటప్పుడు, వండిన తర్వాత చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి. మాంసాన్ని కడిగేటప్పుడు చేతులకు గ్లౌజ్‌లు వేసుకోవాలి. నాన్‌వెజ్ పాత్రలు విడిగా ఉంచాలి.
News November 9, 2025
మామిడిలో ఆకుతినే పురుగు నివారణకు సూచనలు

మామిడిని ఆకుతినే పురుగు ఆశించి పంటకు నష్టం కలిగిస్తుంది. దీని నివారణకు అజాడిరక్టిన్(3000 పి.పి.ఎం.) 300 మి.లీ.లతోపాటు ఎసిఫేట్ 75% ఎస్.పి. 150 గ్రా. లేదా క్వినాల్‌ఫాస్ 25% ఇ.సి. 200ml లేదా ప్రొఫెనోఫోస్ 50% ఇ.సి. 200ml లలో ఏదైనా ఒక దానిని 100 లీటర్ల నీటికి కలిపి చెట్టు పూర్తిగా తడిచేలా పిచికారీ చేసుకోవాలి. అలాగే మామిడి తోటలో కలుపు మొక్కలు లేకుండా శుభ్రంగా ఉండేటట్లు చూసుకోవాలి.


