News March 22, 2025

బయట తినాలంటేనే భయమేస్తోంది

image

TG: ప్రముఖ రెస్టారెంట్లలో అపరిశుభ్ర వాతావరణం ఫుడ్ లవర్స్‌ను ఆందోళనకు గురి చేస్తోంది. గత కొన్ని రోజులుగా HYDలో ఫుడ్ సేఫ్టీ అధికారులు చేస్తోన్న దాడుల్లో కుళ్లిన మాంసం లభించగా, కిచెన్ శుభ్రంగా లేదని, కూరగాయలు సరిగ్గా నిల్వ చేయట్లేదని సోదాల్లో తేల్చారు. దీంతో ఇలాంటి ఫుడ్ ఎలా తినాలని పలువురు కామెంట్లు చేస్తున్నారు. డబ్బులు వెచ్చించినా నాణ్యమైన ఫుడ్ ఇవ్వకపోతే ఎలా అని అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News January 22, 2026

ప.గో: ‘అమరజీవి జలధార’కు రూ.1,400 కోట్లు

image

జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికీ రక్షిత నీరు అందించే ‘అమరజీవి జలధార’ పథకానికి రూ.1,400 కోట్లు మంజూరైనట్లు మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. బుధవారం పాలకొల్లులో ఆర్డబ్ల్యూఎస్‌, ఏజెన్సీ ప్రతినిధులతో ఆయన సమీక్ష నిర్వహించారు. డెల్టా ప్రజల ఆరోగ్య సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేలా ఈ పథకాన్ని రూపొందించామని, పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

News January 22, 2026

HEADLINES

image

* ‘అగ్రిటెక్’తో వ్యవసాయ రంగంలో మార్పులు: CM CBN
* దావోస్‌లో కొనసాగుతున్న CM రేవంత్ టూర్
* అక్రమాలకు కేంద్రంగా సింగరేణి: కిషన్ రెడ్డి
* ఏడాదిన్నర తర్వాత పాదయాత్ర చేస్తా: జగన్
* నైనీ కోల్ బ్లాక్ వివాదం.. రేవంత్‌తో బీజేపీ చీకటి ఒప్పందమన్న కేటీఆర్
* తొలి టీ20.. కివీస్‌పై భారత్ ఘన విజయం
* ఇవాళ 10గ్రా. బంగారం రూ.7వేలు, కేజీ వెండిపై రూ.5వేలు పెరిగిన ధర

News January 22, 2026

అభిషేక్… రికార్డులు షేక్

image

న్యూజిలాండ్‌తో తొలి T20లో అభిషేక్ శర్మ రికార్డ్ సృష్టించారు. 22 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన అతడు, 25 లేదా అంతకంటే తక్కువ బాల్స్‌లో అత్యధిక హాఫ్ సెంచరీలు(8) చేసిన బ్యాటర్‌గా నిలిచారు. గతంలో సూర్య, సాల్ట్, లూయిస్‌తో(7 సార్లు) సంయుక్తంగా ఉన్న అభిషేక్ ఇవాళ వారిని అధిగమించారు. NZపై ఓ భారత్ బ్యాటర్ అతితక్కువ బంతుల్లో అర్ధసెంచరీ చేయడంలోనూ ఘనత వహించారు. గతంలో రోహిత్, రాహుల్ 23బంతుల్లో 50 కొట్టారు.