News March 20, 2025

నేను బీఆర్ఎస్‌లోనే ఉన్నా: ట్విస్ట్ ఇచ్చిన ఎమ్మెల్యే

image

TG: తాను పార్టీ మారలేదని, బీఆర్ఎస్‌లోనే కొనసాగుతున్నట్లు పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి స్పష్టం చేశారు. ఇప్పటికీ బీఆర్ఎస్ సభ్యత్వ రుసుము రూ.5వేలు చెల్లిస్తున్నట్లు తెలిపారు. అభివృద్ధి కోసం సీఎంను కలిస్తే పార్టీ మారినట్లు ప్రచారం చేస్తున్నారని సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌లో పేర్కొన్నారు. తనను అనర్హుడిగా ప్రకటించాలన్న విజ్ఞప్తి చెల్లుబాటు కాదని పేర్కొన్నారు.

Similar News

News March 20, 2025

నాగర్‌కర్నూల్: ముగిసిన ఇంటర్ పరీక్షలు..

image

ఇంటర్మీడియట్‌ పరీక్షలు గురువారంతో ప్రశాంతంగా ముగిశాయి. జిల్లాలోని 33 పరీక్ష కేంద్రాల్లో ఈనెల 5 నుంచి పరీక్షలు జరిగాయి. ద్వితీయ సంవత్సరం 5,996 మంది విద్యార్థులకు గానూ 207 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని నాగర్ కర్నూల్ జిల్లా ఇంటర్ నోడల్ అధికారి జి.వెంకటరమణ తెలిపారు. గురువారం పరీక్షలు పూర్తికావడంతో విద్యార్థులు కేంద్రాల నుంచి ఉత్సాహంతో బయటకు వచ్చారు. దీంతో బస్టాండ్‌లు విద్యార్థులతో కిక్కిరిశాయి.

News March 20, 2025

నా టెంపర్‌మెంట్ ఏం మారలేదు: సీఎం రేవంత్

image

TG: తాను ముఖ్యమంత్రి అయినా 20 ఏళ్ల క్రితం రాజకీయ జీవితం ప్రారంభించినప్పటి టెంపర్‌మెంట్ ఇంకా ఏమాత్రం తగ్గలేదని సీఎం రేవంత్ తెలిపారు. ‘2004లో ప్రజల్లోకి వచ్చాను. నేటికీ టెంపర్‌మెంట్‌లో ఛేంజ్ లేదు. సీఎంగా హుందాగా వ్యవహరించాలని కొంతమంది అంటుంటారు కానీ అలా వ్యవహరిస్తే అటువైపు అర్థం చేసుకునేవారు ఉండాలి కదా? టెంపర్‌మెంట్ పోతే న్యాయం చేయలేం. నా దూకుడు పోలేదు కానీ జ్ఞానం పెరిగింది’ అని తెలిపారు.

News March 20, 2025

ఆర్మీలోకి రూ.7వేల కోట్ల విలువైన ATAGS.. కేంద్రం ఆమోదం

image

భారత ఆర్మీ మరింత శక్తిమంతం కానుంది. రూ.7వేల కోట్ల విలువైన అత్యాధునిక టోవ్డ్ ఆర్టిలరీ గన్ సిస్టమ్(ATAGS) కొనుగోలుకు ప్రధాని నేతృత్వంలోని క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. దేశీయంగా తయారుచేయనున్న 307 ATAGSను భారత్ ఫోర్జ్, TASL సంస్థల నుంచి సైన్యం కొనుగోలు చేయనుంది. వీటికి 48 కి.మీ పరిధి ఉంటుంది. ట్రక్కులపై తరలించే మౌంటెడ్ గన్ సిస్టమ్స్‌ తరహాలో వీటిని తయారుచేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

error: Content is protected !!