News March 11, 2025

వచ్చే 30 ఏళ్ల గురించి ఇప్పుడే ఆలోచిస్తా: సీఎం చంద్రబాబు

image

AP: తాను జీవితంలో నిత్య విద్యార్థినని SRM వర్సిటీ విస్తరణ పనుల శంకుస్థాపన కార్యక్రమంలో CM చంద్రబాబు వ్యాఖ్యానించారు. ‘1995లోనే ఐటీని హైదరాబాద్‌కు తీసుకొచ్చా. వచ్చే 30 ఏళ్ల కోసం ఇప్పుడే ఆలోచించడం నా అలవాటు. ప్రపంచవ్యాప్తంగా ఐటీ ఉద్యోగుల్లో ఎక్కువ ఆదాయం సంపాదించేది భారతీయులే. వారిలో 30శాతం మంది తెలుగువారే’ అని పేర్కొన్నారు. గతంలో జనాభాను సమస్యగా భావించేవారిమని, కానీ దేశానికి అదే బలమని వివరించారు.

Similar News

News November 22, 2025

iBOMMA కేసు.. సీఐడీ ఎంట్రీ

image

iBOMMA నిర్వాహకుడు ఇమ్మడి రవికి ఉచ్చు బిగుస్తోంది. ఇప్పటికే అతనిపై తెలంగాణ సైబర్ క్రైమ్‌ పోలీసులు 10కి పైగా సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అలాగే మనీలాండరింగ్ అంశంపై ఈడీ ఆరా తీయగా, తాజాగా CID కూడా ఎంట్రీ ఇచ్చింది. గేమింగ్, బెట్టింగ్ సైట్లను ప్రమోట్ చేసిన వ్యవహారంపై వివరాలను అధికారులు సేకరించారు. ప్రస్తుతం అతడిని కస్టడీకి తీసుకున్న పోలీసులు 3 రోజులుగా విచారిస్తున్నారు.

News November 22, 2025

బీస్ట్ మోడ్‌లో సమంత

image

ఒకప్పుడు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్న నటి సమంత సడన్‌గా బీస్ట్ మోడ్‌లోకి వెళ్లారు. తాజాగా తన ఫిట్‌నెస్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అందులో ఆమె తన బ్యాక్, ఆర్మ్స్ మజిల్స్‌ను ఫ్లెక్స్ చేస్తూ తన అథ్లెటిక్ బాడీని చూపించారు. ఒకప్పుడు ఇలాంటి బాడీ తనకు సాధ్యం కాదని అనుకున్నానని, కానీ ఇప్పుడు సాధించానని చెప్పుకొచ్చారు. కాగా ఆమె ఫిట్‌నెస్‌కి అభిమానులు ఫిదా అవుతున్నారు.

News November 22, 2025

యాపిల్ కంటే చిన్న పసికందు.. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్

image

ముంబైలో 350 గ్రాముల బరువుతో పుట్టిన చిన్నారి 124 రోజుల పాటు NICUలో చికిత్స పొందిన తర్వాత డిశ్చార్జ్ కావడం అద్భుతంగా నిలిచింది. జూన్ 30న ప్రీమెచ్యూర్‌గా (25 వారాల గర్భధారణ) జన్మించిన ఈ బిడ్డ యాపిల్ కంటే చిన్నగా ఉండేది. పుట్టిన తర్వాత అనేక సవాళ్లను ఎదుర్కొంటూ ఇటీవల డిశ్చార్జ్ అయింది. బిడ్డ బరువు 1.8 కిలోలకు పెరిగింది. దేశంలో ఇప్పటివరకు బతికిన అత్యంత తక్కువ బరువున్న శిశువుగా నిలిచింది. (PC: TOI)