News September 3, 2025
నేను చాలా యాక్టివ్‌గా ఉన్నా: ట్రంప్

సోషల్ మీడియాలో తనపై వస్తున్న రూమర్స్ వింటున్నానని, అవన్నీ అవాస్తవాలేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొట్టిపారేశారు. గత వారం రోజులుగా తాను గోల్ఫ్ ఆడుతూ చాలా యాక్టివ్‌గా ఉన్నట్లు వెల్లడించారు. వైట్ హౌస్‌లో ఓ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. కాగా కొద్ది రోజులుగా ట్రంప్ బహిరంగంగా కనిపించకపోవడంతో సోషల్ మీడియాలో ‘<<17563031>>ట్రంప్ ఈజ్ డెడ్<<>>’ అంటూ ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే.
Similar News
News February 11, 2026
జీడిమామిడిలో బూడిద తెగులు – నివారణ ఎలా?

జీడిమామిడి తోటల్లో పూత దశలో వివిధ రకాల తెగుళ్లు రావడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా పొడి వాతావరణం ఉన్నప్పుడు బూడిద తెగులు ఎక్కువగా పూతను ఆశిస్తుంది. లేత చిగుర్లను, పూతను బూడిద తెగులు ఆశించి ఎండిపోయేలా చేసి పంటను నష్టపరుస్తుంది. ఫలితంగా దిగుబడి తగ్గుతుంది. దీని నివారణకు లీటరు నీటికి సల్ఫర్ 3 గ్రాములు కలిపి పిచికారీ చేయాలి. లేదా లీటరు నీటికి ట్రై డేమోర్ప్ 1.5 గ్రాములు కలిపి పిచికారీ చేయాలి.
News February 11, 2026
ఏకాదశి: ఎల్లుండి ఉపవాసం ఉంటున్నారా?

ఏకాదశికి చాలామంది ఉపవాసం ఉంటారు. అయితే ఆ ఒక్కరోజే కాకుండా మూడ్రోజులు (ఏకాదశి, దశమి, ద్వాదశి) కలిపి ‘హరిత్రయం’ పాటిస్తూ ఉపవాసం ఉండాలంటున్నారు పండితులు. దీనివల్ల అధిక పుణ్యం లభిస్తుందట. నియమాలు.. దశమి నాడే ఉపవాస నియమాలు ప్రారంభించాలి. దశమి రాత్రి అల్పాహారం తీసుకుని, నేలపై పడుకోవాలి. ఏకాదశి నాడు ఉపవాసం ఉంటూ ఆధ్యాత్మిక చింతనలో గడపాలి. ద్వాదశి ఘడియలు ముగిసేలోపే వ్రత సమాప్తి (పారణ) చేయాలి.
News February 11, 2026
SEBI 91 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (<


