News October 12, 2025
IMA కరీంనగర్ అధ్యక్షురాలిగా డా.ఆకుల శైలజ

2025–26 సంవత్సరానికి భారత వైద్యుల సంఘం(IMA) కరీంనగర్ జిల్లా అధ్యక్షురాలిగా డా.ఆకుల శైలజను ఎన్నుకున్నట్లు IMA ప్రకటించింది. ఎన్నికైన డా.ఆకుల శైలజను కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ అభినందనలు తెలిపారు. కరీంనగర్ ప్రజల ఆరోగ్య పరిరక్షణలో, వైద్య సేవల అభివృద్ధిలో ఆమె చేస్తున్న కృషిని ప్రసంశించారు.
Similar News
News October 12, 2025
కరీంనగర్: యథావిధిగా ప్రజావాణి

ప్రజల సమస్యల సత్వర పరిష్కారం కోసం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో ప్రజావాణి కార్యక్రమాన్ని యథావిధిగా సోమవారం నుంచి కొనసాగించనున్నట్లు కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. ప్రజలు ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడటంతో ప్రజావాణి కార్యక్రమం యాథావిధిగా కొనసాగుతుందన్నారు.
News October 11, 2025
కరీంనగర్: DCC రేసులో ఎవరెవరున్నారు?

KNR <<17974062>>DCC అధ్యక్షుడి రేసులో<<>> సుడా ఛైర్మన్ నరేందర్ రెడ్డి, రాజేందర్ రావు, పద్మాకర్ రెడ్డి, శ్రీరామ చక్రవర్తి, వైద్యుల అంజన్ కుమార్‌తో పాటు పలువురు పోటీపడుతున్నారు. సిరిసిల్ల నుంచి సంగీతం శ్రీనివాస్ రావు, చక్రధర్ రెడ్డి, గడ్డం నర్సయ్య ఆశిస్తున్నారు. జగిత్యాల నుంచి సుజిత్ రావు, జువ్వాడి కృష్ణారావు, కరంచంద్ ప్రయత్నిస్తున్నారు. పెద్దపల్లి నుంచి తిరుపతియాదవ్, సదానందం, శశిభూషణ్, సారయ్యగౌడ్ రేసులో ఉన్నారు.
News October 11, 2025
రాష్ర్ట స్థాయికి రామడుగు మోడల్ స్కూల్ విద్యార్థులు

రామడుగు మోడల్ స్కూల్ విద్యార్థులు జిల్లాస్థాయి జానపద నృత్య పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి ప్రథమ బహుమతి సాధించి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఎస్వీఆర్టీ ఆధ్వర్యంలో కళాభారతిలో ఈ పోటీలు జరిగాయి. విద్యార్థులకు మార్గదర్శకత్వం వహించిన గైడ్ ఉపాధ్యాయుడు రత్నాకర్ కృషిని పాఠశాల ప్రిన్సిపల్ ఆడెపు మనోజ్ కుమార్ ప్రశంసించారు. విద్యార్థులను డీఈఓ మొండయ్య అభినందించారు.