News April 10, 2025
ఇమేజ్ స్కామ్.. ఎలా బయటపడొచ్చు?

✒ వాట్సాప్ సెట్టింగ్స్‌లో ఆటో డౌన్లోడ్ ఆప్షన్‌ను డిసేబుల్ చేయాలి.
✒ పరిచయం లేని నంబర్ల నుంచి వచ్చే ఫొటోలు, లింక్స్‌ను ఎట్టిపరిస్థితుల్లోనూ డౌన్లోడ్ చేయొద్దు.
✒ అనుమానిత నంబర్ల కాల్స్‌కు స్పందించవద్దు. వాటిని వెంటనే బ్లాక్ చేయాలి.
✒ వాట్సాప్‌ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉండాలి.
✒ ఒకవేళ ఫొటోలు డౌన్లోడ్ చేశాక ఫోన్లో మార్పులు కనిపిస్తే సైబర్ క్రైమ్‌కు ఫిర్యాదు చేయండి.
Similar News
News September 15, 2025
బిగ్ బాస్: ఈ వారం ఎలిమినేట్ ఎవరంటే?

తెలుగు బిగ్‌బాస్ సీజన్-9లో తొలి వారం శ్రష్ఠి వర్మ ఎలిమినేట్ అయ్యారు. ఆమెను ఎలిమినేట్ చేసినట్లు హోస్ట్ నాగార్జున ప్రకటించారు. దీంతో నామినేషన్స్‌లో ఉన్న నటి ఫ్లోరా సైనీ, సుమన్ శెట్టి, రీతూ చౌదరి సేఫ్ జోన్లోకి చేరుకున్నారు. వీళ్లు హౌస్‌లోనే కొనసాగనున్నారు. కొరియోగ్రాఫర్ అయినా శ్రష్ఠి ఈ సీజన్లో సెలబ్రిటీ కోటాలో హౌస్‌లోకి వెళ్లారు.
News September 15, 2025
నా మెదడు నెలకు రూ.200 కోట్లు సంపాదించగలదు: గడ్కరీ

ఇథనాల్ పెట్రోల్ విషయంలో తాను అవినీతికి పాల్పడుతున్నట్లు వస్తున్న ఆరోపణలను కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఖండించారు. ‘నాకు షుగర్ ఫ్యాక్టరీ, డిస్టిలరీ, పవర్ ప్లాంట్ ఉన్నాయి. నా ఆదాయం పుష్కలంగా ఉంది. నా మెదడు నెలకు రూ.200 కోట్లు సంపాదించగలదు. నాకు దిగజారే అవసరం లేదు’ అని నాగ్‌పుర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో తెలిపారు. తనపై తప్పుడు ప్రచారం జరుగుతోందని వెల్లడించారు.
News September 14, 2025
2 కీలక వికెట్లు కోల్పోయిన భారత్

పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచులో టీమ్ ఇండియా ఓపెనర్లు ఔటయ్యారు. గిల్ 10 రన్స్ చేసి స్టంపౌట్ అయ్యారు. అభిషేక్ శర్మ 2 సిక్సర్లు, 4 ఫోర్లతో రఫ్పాడించారు. అదే జోరులో మరో భారీ షాట్‌కు ప్రయత్నించి బౌండరీ దగ్గర క్యాచ్ ఇచ్చారు. ప్రస్తుతం భారత్ స్కోర్ 4 ఓవర్లలో 42/2గా ఉంది. సూర్య సేన విజయానికి మరో 86 పరుగులు అవసరం.