News August 18, 2024
ఇమాన్వీ ఎంపిక.. టాలెంట్ ఉంటే అవకాశాలే
హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కనున్న చిత్రంలో ఇమాన్వీ హీరోయిన్‌గా ఎంపికైన సంగతి తెలిసిందే. మోడలింగ్, నటనలో అనుభవాన్ని గతంలో ఎక్కువగా పరిగణనలోకి తీసుకునేవారు. కానీ ఇప్పుడు ఈమె ఎంపికతో సోషల్ మీడియాలో నైపుణ్యాలను ప్రదర్శించే వారికీ అవకాశాలు దక్కుతాయని తేలుస్తోంది. దీంతో స్కిన్‌షోపైనే కాకుండా మీలోని టాలెంట్‌ని ప్రదర్శిస్తే అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయని పలువురు కామెంట్లు చేస్తున్నారు.
Similar News
News January 22, 2025
రిలేషన్‌కు బ్రేకప్ చెబుతారనే సంకేతాలు ఇవి..
సైకాలజిస్టుల ప్రకారం మీతో రిలేషన్‌ను మీ పార్ట్నర్ ముగించాలని డిసైడ్ అయితే ఇలా తెలుస్తుంది
– ఒకప్పటిలా మీతో సన్నిహితంగా ఉండకపోవడం/ సరిగా స్పందించకపోవడం/ కారణాలు ఎక్కువ చెప్పడం/ గొడవలు పెరగడం/కేరింగ్ & షేరింగ్ తగ్గడం
– తనతో ఫ్యూచర్ గురించి చెబితే అనాసక్తి చూపడం
– క్లోజ్ రిలేషన్ కాకుండా ఫార్మల్‌గా ఉండటం
– మరొకరితో పోల్చడం, ఇతరుల గురించి మాట్లాడటం
– ప్రతి విషయాన్ని గుచ్చి చూడటం, లెక్కగట్టడం
News January 22, 2025
టీమ్ఇండియా వికెట్ టేకర్‌ను ఫినిష్ చేసిన BCCI: ఆకాశ్ చోప్రా
యుజ్వేంద్ర చాహల్ పనైపోయినట్టేనని మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అన్నారు. CT సిరీసుకు ఎంపిక చేయకపోవడం ద్వారా BCCI, టీమ్ మేనేజ్‌మెంట్ అతడి కథను ముగించిందని పేర్కొన్నారు. వికెట్లు తీస్తున్నప్పటికీ రెండేళ్ల క్రితమే అతడిని వన్డేల నుంచి తప్పించారని గుర్తుచేశారు. ‘దేశవాళీ క్రికెట్ ఆడకపోవడంతో పొట్టి ఫార్మాట్లోనూ ఎంపిక చేయడం లేదు. ఇంత గ్యాప్ తర్వాత మళ్లీ అతడిని ఎంపిక చేస్తే తిరోగమన చర్యే అవుతుంది’ అన్నారు.
News January 22, 2025
పేదల బాధ చూసి ఆవేశంలో కొట్టా: ఈటల
TG: హైడ్రా, మూసీ బాధితులకు బీజేపీ అండగా ఉంటుందని ఆ పార్టీ ఎంపీ ఈటల రాజేందర్ వెల్లడించారు. రియల్టర్ల పేరుతో కొందరు దౌర్జన్యాలకు దిగుతున్నారని, పహిల్వాన్లను పెట్టి స్థానికులను బెదిరిస్తున్నారని మండిపడ్డారు. పోచారం <<15213239>>ఘటనపై <<>>కలెక్టర్, సీపీ దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదని, పేదల బాధ చూసి ఆవేశంలో కొట్టినట్లు చెప్పారు. అధికారులు ఇష్టారీతిన వ్యవహరిస్తే DOPTకి ఫిర్యాదు చేస్తామని ఈటల హెచ్చరించారు.