News December 12, 2025

IMF షరతులతో పాక్ ఉక్కిరిబిక్కిరి

image

పాకిస్థాన్‌‌కు విడతల వారీగా నిధులు విడుదల చేస్తామని ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్(IMF) 7 బిలియన్ డాలర్లు బెయిలవుట్ ప్యాకేజీని ప్రకటించింది. అలాగే దశలవారీగా కండిషన్స్ కూడా పెడుతోంది. తాజాగా మరో 11 షరతులు పెట్టడంతో మొత్తం నిబంధనల సంఖ్య 64కు చేరింది. వీటిని 18 నెలల్లో అమలు చేయాలి. వీటిలో మొదటిది కరప్షన్ కట్టడికై కేంద్ర ప్రభుత్వ అధికారుల ఆస్తుల వివరాలు ఈ ఏడాది చివరినాటికి ప్రకటించేలా డెడ్ లైన్ విధించింది.

Similar News

News December 25, 2025

ఓ వెబ్ సిరీస్.. 8 వేల ఉద్యోగాలు, $1.4 బిలియన్లు!

image

పేరుకు తగ్గట్టే ‘Stranger Things’ సిరీస్ సంచలనాలు సృష్టిస్తోంది. ప్రేక్షకులను అలరిస్తూనే 2016 నుంచి ఇప్పటిదాకా $1.4B మేర అమెరికా GDPకి దోహదపడింది. 8 వేల జాబ్స్ కల్పించింది. ఆ సిరీస్‌లో చూపిన ప్రదేశాలకు పర్యాటకులు పోటెత్తడంతో టూరిజం ఆదాయం భారీగా వచ్చింది. అందులో కనిపించిన ఫుడ్ ఐటమ్స్, బొమ్మలు, వీడియో గేమ్స్, పాటలకూ డిమాండ్ పెరిగింది. ఇప్పటిదాకా ఈ సిరీస్ 120 కోట్ల <<18400629>>వ్యూస్<<>> సాధించింది.

News December 25, 2025

DGP ఎంపికపై కీలక ఆదేశాలు

image

TG: తాత్కాలిక పద్ధతిలో రాష్ట్ర DGPగా శివధర్ రెడ్డి నియామకం చెల్లదంటూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆయన నియామక ఉత్తర్వుల రద్దుకు నిరాకరించింది. అయితే DGP ఎంపిక ప్రక్రియను కొనసాగించాలని ప్రభుత్వానికి సూచించింది. ఇందుకు సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించాలని స్పష్టం చేసింది. సీనియర్ ఐపీఎస్‌ల జాబితాను UPSCకి పంపించిన తర్వాత ఈ వ్యవహారంపై కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.

News December 25, 2025

ఆస్టియోపోరోసిస్ ముప్పు ఎవరికి ఉంటుందంటే..

image

40 ఏళ్ల తర్వాత స్త్రీల శరీరంలో ఈస్ట్రోజెన్, ప్రొజెస్టిరాన్ హార్మోన్ల స్థాయి తగ్గడం ప్రారంభమవుతుంది. శరీరంలో విటమిన్ డి లోపం కూడా మొదలవుతుంది. ఈ కారణంగా ఎముకలు బలహీనంగా, మృదువుగా మారడం ప్రారంభిస్తాయి. చాలామంది మహిళల్లో బోలు ఎముకల వ్యాధి సమస్య ఈ వయసులోనే మొదలవుతుంది. సరైన జీవనశైలి లేని స్త్రీలు బోలు ఎముకల వ్యాధికి గురయ్యే అవకాశం ఉంది. దీంతోపాటు బీపీ సమస్య కూడా వస్తుందని నిపుణులు చెబుతున్నారు.