News March 12, 2025
IMLT20: ఒకే సీజన్లో 7 సెంచరీలు

ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ టీ20లో సెంచరీల మోత మోగుతోంది. ఈ టోర్నీ ప్రారంభమయ్యాక ఈ సీజన్లోనే తొలి సెంచరీ నమోదవ్వగా ఇప్పటివరకు ఏడు శతకాలు బాదారు. ఆస్ట్రేలియన్ ప్లేయర్ వాట్సన్ ఒక్కడే మూడు సెంచరీలు చేయగా, విండీస్ ప్లేయర్ సిమ్మన్స్, బెన్ డంక్(AUS), సంగక్కర, తరంగ తలో సెంచరీ చేశారు. ఇంకా నాలుగు మ్యాచులు మిగిలి ఉండగా మరెన్ని సెంచరీలు నమోదవుతాయో చూడాలి.
Similar News
News November 1, 2025
పోలవరం నిర్వాసితులకు రూ 1000 కోట్లు పంపిణీ

AP: పోలవరం భూ నిర్వాసితులకు రూ.1000 కోట్లు పంపిణీ చేశారు. ఈ మేరకు నిర్వాసితుల అకౌంట్లలో నగదు జమ చేసినట్లు మంత్రి రామనాయుడు వెల్లడించారు. ఏలూరులోని వేలేరుపాడులో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అందరికీ అండగా నిలుస్తుందన్నారు. భూసేకరణ, పరిహారం చెల్లింపుల్లో దళారుల మాట నమ్మొద్దని సూచించారు. 2027కల్లా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉన్నట్లు చెప్పారు.
News November 1, 2025
ఢిల్లీకి సంజూ.. రాజస్థాన్కు స్టబ్స్?

IPL వేలానికి ముందు రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య కీలక స్వాప్ డీల్ పూర్తయినట్లు సమాచారం. RR కెప్టెన్ సంజూ శాంసన్, DC ప్లేయర్ ట్రిస్టన్ స్టబ్స్ జట్లు మారడం ఖాయమైనట్లు తెలుస్తోంది. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుందని IPL వర్గాలు చెబుతున్నాయి. KL రాహుల్ పేరు కూడా చర్చల్లోకి వచ్చినప్పటికీ ఆయనను వదులుకోవడానికి ఢిల్లీ సుముఖత చూపలేదు. 2026 సీజన్కు సంజూను కెప్టెన్ చేయాలని DC భావిస్తోంది.
News November 1, 2025
కాసేపట్లో వర్షం

TG: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రానున్న 2-3 గంటల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. నల్గొండ జిల్లాలో ఉరుములతో కూడిన వర్షాలు పడతాయని ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్, జనగాం, ఆసిఫాబాద్, మంచిర్యాల, రంగారెడ్డి, యాదాద్రిలో తేలికపాటి వర్షం పడే ఛాన్స్ ఉందని ఎల్లో అలర్ట్ ఇచ్చింది. గంటకు 40కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది.


