News July 18, 2024
తక్షణమే కాల్పుల విరమణ చేపట్టండి: హమాస్, ఇజ్రాయెల్‌కు భారత్ పిలుపు

గాజాలో తక్షణమే కాల్పుల విరమణ చేపట్టాలని హమాస్, ఇజ్రాయెల్‌కు భారత్ పిలుపునిచ్చింది. బేషరతుగా బందీలను విడుదల చేయాలని ఐక్యరాజ్యసమితి వేదికగా హమాస్‌ను డిమాండ్ చేసింది. గాజా స్ట్రిప్‌లో వెంటనే మానవతా సేవలు కొనసాగించాలని పేర్కొంది. అలాగే హమాస్-ఇజ్రాయెల్ యుద్ధాన్ని ఆపేందుకు ప్రయత్నించిన ఈజిప్ట్, ఖతర్ దేశాలను భారత్ అభినందించింది.
Similar News
News January 28, 2026
RTC ఉద్యోగులకు గుడ్ న్యూస్

AP: RTCలో పనిచేస్తున్న 4వేల మందికి పైగా ఉద్యోగులకు ప్రమోషన్లు రానున్నాయి. ADC/కంట్రోలర్, లీడింగ్ హెడ్స్‌లకు పదోన్నతి లభిస్తుంది. నిర్ణీత టెస్ట్ పాసైన కండక్టర్లు Jr అసిస్టెంట్లు కానున్నారు. ‘గత OCTలోనే 7500 మందికి ప్రమోషన్‌పై GO వచ్చినా 550 మందికే ఇచ్చారు. దీనిపై లేఖ ఇవ్వగా సీనియార్టీపై క్లారిటీ ఇస్తూ MD ఆదేశాలిచ్చారు. వారంలోపే మిగతా వారికీ పదోన్నతి వస్తుంది’ అని EU నేతలు దామోదర్, నరసయ్య తెలిపారు.
News January 28, 2026
రూ.1,002 కోట్లు.. తొలి ఇండియన్ సినిమాగా ధురంధర్

రణ్వీర్ సింగ్ హీరోగా ఆదిత్యధర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ధురంధర్’ బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఈ చిత్రం ఇండియాలోనే రూ.1,002కోట్ల (గ్రాస్) వసూళ్లు సాధించింది. స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా హిందీలో విడుదలై వెయ్యి కోట్లు కలెక్ట్ చేసిన ఇండియన్ సినిమాగా రికార్డులకెక్కింది. షారుఖ్ ఖాన్ జవాన్ (రూ.760) రికార్డులు బద్దలుకొట్టింది.
News January 28, 2026
చంద్రబాబు అరకు పర్యటన రద్దు

AP: సీఎం చంద్రబాబు రేపటి అరకు పర్యటన రద్దైంది. విమాన ప్రమాదంలో మరణించిన మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు గురువారం ఆయన బారామతి వెళ్లనున్నారు. దీంతో రేపటి పర్యటనను రద్దు చేసుకున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. సీఎంతో పాటు మంత్రి లోకేశ్ కూడా అజిత్ పవార్ అంత్యక్రియలకు హాజరుకానున్నారు.


