News September 5, 2025
వినాయకుడి నిమజ్జనం.. ఇలా చేస్తే పుణ్యం

గణేశుడి నిమజ్జనం పవిత్రంగా చేస్తే సకల శుభాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. వినాయకుడికి ఉద్వాసన పలికే ముందు పూజ చేసి, గుంజీలు తీయాలి. పత్రి ఆకులతో చేసిన కంకణాలు చేతికి కట్టుకోవాలి. హారతి ఇచ్చి విగ్రహాన్ని జరపాలి. చెరువు దగ్గరకు చేరుకున్నాక అగరబత్తులు వెలిగించి, పువ్వులు పెట్టాలి. కొబ్బరికాయ కొట్టి మరోసారి హారతి ఇవ్వాలి. విగ్రహాన్ని నీటిలో నిమజ్జనం చేసి ‘వచ్చే ఏడు మళ్లీ రావయ్యా’ అని మొక్కాలి.
Similar News
News January 29, 2026
జనవరి 29: చరిత్రలో ఈరోజు

1912: సుప్రీంకోర్టు 14వ ప్రధాన న్యాయమూర్తి అజిత్ నాథ్ రే జననం
1936: సినీ గేయ రచయిత వేటూరి సుందరరామ్మూర్తి జననం (ఫొటోలో)
1936: సినీ దర్శకుడు బైరిశెట్టి భాస్కరరావు జననం
1962: జర్నలిస్టు, ఉద్యమకారిణి గౌరీ లంకేష్ జననం
2003: నటి పండరీబాయి మరణం
* జాతీయ పజిల్ దినోత్సవం
News January 29, 2026
ఈ 4 పండ్లు తింటే టైప్-2 డయాబెటిస్ ముప్పు

సపోటాల్లోని విటమిన్ A, C, ఐరన్, పొటాషియం, కాల్షియం, ఫాస్పరస్, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు, ఫ్రక్టోజ్, సుక్రోజ్ రక్తంలో షుగర్ లెవెల్స్‌ను పెంచుతాయి. అరటిపండులో ఫ్రక్టోజ్, సుక్రోజ్ ఉన్నందున వారానికి 2-3 కంటే ఎక్కువ తీసుకోకూడదు. మామిడి పండ్లు, సీతాఫలం తిన్నా షుగర్ లెవెల్స్ పెరిగే ప్రమాదం ఉండడంతో రెగ్యులర్గా తినకూడదు. షుగర్ కంట్రోల్‌లో లేనివారు/ఇన్సులిన్ వాడతున్న వారు డాక్టర్ సలహా తీసుకోవాలి.
News January 29, 2026
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.


